టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఆడియన్స్ అంతా రాజమౌళి సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాంటిది.. రాజమౌళి ఏకంగా మూడు సినిమాల కోసం ఎంతో ఈగరుగా వెయిట్ చేస్తున్నాడంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెటింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఇంతకీ రాజమౌళిని సైతం అంత సస్పెన్స్‌లో పడేసిన మూడు సినిమాలు ఏంటో.. ఆ డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఎస్ఎస్ఎంబి 29 షూట్ సర్వే గంగా పూర్తి చేస్తున్నాడు జక్కన్న. ఇప్పటికే ఒడిశాలో షూట్ కంప్లీట్ చేశారు టీం. ప్రస్తుతం ఫారెన్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్న క్రమంలో అక్కడే ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేశాడు రాజమౌళి. తను మాట్లాడుతూ నేను కూడా ఒక ప్రేక్షకుడినని.. కొన్ని సినిమాల విషయంలో ఎంతో ఆసక్తి పెంచుకున్నాను అంటూ వెల్లడించాడు.
రాబోయే సినిమాల్లో ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబో వచ్చే సినిమా కోసం.. అలాగే సందీప్ రెడ్డివంగా – ప్రభాస్ కాంబో కోసం, ఇంకా బుచ్చిబాబు సన్నా – రామ్ చరణ్ కాంబినేషన్ సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఉన్నానని.. ఈ మూడు సినిమాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలు ఎలా ఉంటాయో అని ఆత్రుత నాకు ఉందని రాజమౌళి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రాజమౌళి చేసిన కామెంట్స్ నచ్చిండా తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ ముగ్గురు స్టార్ హీరోల దర్శకుల అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.