టాలీవుడ్ నందమూరి నటసింహం బాలయ్య, బోయపాటి శ్రీను కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి కాంబోలో సింహా, లెజెండ్, అఖండ లాంటి సినిమాలు తెరకెక్కి ఒకదాన్ని మించి మరొకటి సక్సస్‌లు అందుకున్నాయి. ఇక అఖండ తర్వాత ఆయన కెరీర్‌కు మహార్దశ పట్టింది అనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్లు అందుకున్న బాలయ్య.. మరోసారి బోయపాటి డైరెక్షన్లో అఖండ 2 తాండవం సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నటిస్తున్నాడు.
ప్రస్తుతం ఈ సినిమా షూట్ సర్వే గంగా జరుగుతుంది. కాగా.. ఇప్పటివరకు బాలయ్య నటించిన పాత్రలన్నీ ఒక ఎత్తు అయితే.. అఖండలో అఘోర పాత్ర మరో లెవెల్. ఈ క్రమంలోనే బాలయ్య అఖండ 2తో ఆడియన్స్ లో పిక్స్ లెవెల్ లో ఆంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే మూవీలో అసలు హైలెట్స్ ఇవే అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. సినిమాల్లో బాలయ్య అఘోర పాత్రతో పాటు.. పొలిటికల్ అంశాలను హైలెట్ చేసేలా మరో పాత్రను డిజైన్ చేశాడట బోయపాటి.
ఇక బాలయ్య రెండు పాత్రలు రకరకాల వేరియేషన్స్ తో.. ఎమోషన్స్ తో.. యాక్షన్ కలగలిపి ఫుల్ మీల్స్‌లా అనిపించడం కాయమని టాక్ నడుస్తుంది. ఇక అఘోరగా బాలయ్య ఎంట్రీ ఆడియన్స్ లో గూస్ బంప్స్ తెప్పిస్తుందని సినిమాకు ఇదే హైలెట్ కానుందని.. ఇక ఇంటర్వెల్ బ్యాంక్ లో వచ్చే ట్విస్ట్.. ఫైట్ మరో హైలెట్ అని సమాచారం.