సినీ ఇండస్ట్రీ అంటే రంగుల ప్రపంచం. ఇక్కడ రకరకాల వ్యక్తిత్వాలు, రకరకాల మనుషులు ఉంటారు. ప్రతి ఏడది ఎంతోమంది నటిమలు సెలబ్రిటీలుగా ఎదగాలని ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రమే వారిలో సక్సెస్ సాధించి ఆ సక్సెస్ ను కాపాడుకుంటూ కెరీర్ను కొనసాగిస్తూ ఉంటారు. అయితే.. మరి కొంతమంది ఆ సక్సెస్ ని కాపాడుకునే దారిలో తప్పటడుగులు వేస్తూ ఉంటారు. ఇక కెరీర్‌లో ఎదురైన పరిచయాలను స్నేహంగా మలుచుకోవడం.. తర్వాత ప్రేమా, రిలేషన్షిప్ అంటూ కెరీర్‌పై ఫోకస్ తప్పిస్తూ.. వ్యక్తిగత జీవితం గురించి నిర్ణయాలు తీసుకుంటూ సినిమాలకు దూరమవుతూ ఉంటారు.
ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో బిజీగా రాణించిన ఓ హీరోయిన్ కూడా అదే కోవకు చెందుతుంది. జీవితంలో తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయంతో సినిమాలకు దూరమైన ఈ అమ్మడు పూర్తిగా సైలెంట్ అయిపోయింది. ఇంతకీ ఈమె ఎవరో చెప్పలేదు కదా తనే హీరోయిన్ నికిత తుక్రాల్. తెలుగు, తమిళ్, కన్నడ మలయాళ భాషల్లో వరుస సినిమాలో బిజీగా రాణించిన నికితా.. ఎన్నో హిట్ సినిమాలతో ఆకట్టుకుంది. కెరీర్లో చేసిన చిన్న తప్పు కారణంగా ఆఫర్స్ ని కోల్పోయి ఫేడౌట్ హీరోయిన్ గా మారిపోయింది. ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన ఘటోత్కచుడు సినిమాలో బాలనటిగా మెరిసిన ఈ అమ్మడు.. హాయ్ సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది.
తర్వాత తెలుగులో సంబరం, కళ్యాణ రాముడు, డాన్ సినిమాల్లో ఆకట్టుకుంది. మంచి ఫామ్ లో ఉండగా అంతకుముందే పెళ్లయిన స్టార్ హీరో తో ప్రేమాయణం నడిపినట్లు సమాచారం. ఈ క్రమంలోనే దీనికి సంబంధించిన వార్తలు బయటకు రావడంతో.. ఆమె ఫ్యాన్స్ కూడా నికిత పై విమర్శలు గుప్పించారు. ఇక ఆ స్టార్ హీరో తో ప్రేమాయణం అతడి భార్యకు కూడా తెలియడంతో నిఖితకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందని సమాచారం. దీంతో నిఖిత ప్రేమను వదిలేసింది. ఇంతకీ ఆమె ప్రేమించిన హీరో మరెవరో కాదు ఇటీవల అభిమాని హత్య ఆరోపణలతో జైల్లో ఉండి వచ్చిన కన్నడ స్టార్ హీరో దర్శన్.