ప్రస్తుతం ఎక్కడ చూసినా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా పేరు మారుమోగిపోతుంది. తెలుగు ఇండస్ట్రీలో ప్రియాంకను ఇష్టపడే జనాలు చాలా అరుదుగా ఉంటారు. కారణం.. ఎప్పటి వరకు తెలుగు సినిమాలను చేయకపోవడమే. అసలు తెలుగు సినిమాలపై ఇంట్రెస్టే చూపించని ప్రియాంక.. తెలుగు సినిమాలను పొగిడిన సందర్భాలు కూడా లేవు. మిగతా బాలీవుడ్ స్టార్స్ అంతా తెలుగు హీరోలన్నీ ఏదో ఒక మూమెంట్లో ప్రశంసిస్తూ వచ్చారు. కానీ.. ప్రియాంక మాత్రం ఎప్పుడు అలా తెలుగు స్టార్స్ ను కనీసం ప్రశంసించలేదు. అలాంటి హీరోయిన్ రాజమౌళి.. మహేష్ బాబు సినిమా కోసం ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు.. అనే సందేహాలు అందరిలోనూ ఉన్నాయి.
ఎంతోమంది స్టార్ హీరోయిన్స్ ఉన్నారు. మరి ఎందుకు ప్రియాంక చోప్రాని హీరోయిన్గా తీసుకున్నాడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అయితే ఇందులో రాజమౌళి స్వార్థమే ఎక్కువగా ఉందని టాక్. జక్కన్న తన సినిమాలకు గ్లోబల్ వైడ్ ప్రమోట్ చేసుకోవాలని భావిస్తున్నాడు. ఈ క్రమంలోనే గ్లోబల్ వైడ్గా సినిమా హిట్ కావాలంటే.. ఆ రేంజ్ లో ప్రమోషన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే కచ్చితంగా సినిమాలో గ్లోబల్ బ్యూటీలే నటించాలి. ఈ కారణంగానే ప్రియాంక చోప్రాను చూజ్ చేసుకున్నాడని టాక్ వైరల్‌గా మారుతుంది.
ముఖ్యంగా ఈమెకు బాలీవుడ్‌లోనే కాదు.. హాలీవుడ్‌లోనూ మంచి పలుకుబడి ఉంది. ఈ క్రమంలోనే ప్రియాంక చోప్రా ఓ సినిమాలో నటిస్తుందంటూ.. కచ్చితంగా హాలీవుడ్ లోనూ ఆమెకు మంచి పబ్లిసిటీ ఏర్పడుతుందని.. దీంతో ప్రియాంక చోప్రాన్ని జక్కన్న సెలెక్ట్ చేసుకున్నాడట. ప్రియాంక చోప్రా నటన, అలాగే లుక్స్ కూడా ఆడియన్స్‌ను ఆకట్టుకుంటాయని.. తను గట్టిగా నమ్మి ఆమెను చూజ్ చేసుకోలేదట. గ్లోబల్ ఇమేజ్ ఉంది కాబట్టే రాజమౌళి స్వార్థంగా ఆలోచించి మహేష్ బాబు సినిమాలో తనను హీరోయిన్గా తీసుకున్నట్లు సమాచారం.