సినీ ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరో, హీరోయిన్లుగా సక్సెస్ సాధించిన వారు కేవలం సినిమాలతోనే కాదు.. ఇతర బిజినెస్ లోను రాణిస్తూ కోట్లు సంపాదిస్తూ ఉంటారు. అయితే.. కొంతమంది పలు బ్రాండ్ ప్రమోషన్స్ ద్వారా డబ్బు కూడబెట్టుకుంటున్నారు. సినిమాల మాదిరిగానే యాడ్స్‌లో నటిస్తూ కోట్లు జమ చేస్తున్నారు. రెండు, మూడు నిమిషాలు యాడ్ కోసం హోటల్‌లో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న హీరోయిన్లు కూడా ఉన్నారు. అయితే వీరందరికీ భిన్నంగా ఓ స్టార్ హీరోయిన్ నిలిచింది. స్వయంగా ఆమె మాట్లాడుతూ తను ఏకంగా 15 యాడ్ ప్రమోషన్స్ ను రిజెక్ట్ చేసి.. కోట్లల్లో డబ్బులు నష్టపోయానని చెప్పుకొచ్చింది.
ఆ ప్రమోషన్స్ అన్ని చేసి ఉంటే చాలా డబ్బులు వచ్చేవని వెల్లడించింది. మొదట్లో సౌత్ సెన్సేషనల్ బ్యూటీగా మారిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత బాలీవుడ్ లోను పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరోయిన్గా రాణిస్తున్న ఈ అమ్మడు.. ఒక్కో సినిమాకు కోట్లలో రెమ్యూనరేషన్ అందుకుంటుంది. ఇంతకీ తను ఎవరో కాదు స్టార్ట్ బ్యూటీ సమంత. ఇప్పటికే ఎన్నో యాడ్స్ లో మెరిసిన ఈ అమ్మడు.. ఎన్నో బ్రాండ్స్ ని కూడా ప్రమోట్ చేసింది. తాజాగా.. ఆమె ఒంటరిగా మాట్లాడుతూ ఇప్పటి వరకు నాకు వచ్చిన బ్రాండ్ ప్రమోషన్ ఆఫర్స్‌లో 15 యాడ్స్ ను రిజెక్ట్ చేశానని.. దానివల్ల నేను కోట్లల్లో నష్టపోయానని వివరించింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత.. ప్రతిరోజు నా లక్షాన్ని మరింత మెరుగుపరుచుకుంటూ తెలివిగా ఆలోచించడం నేర్చుకుంటున్నా. నా 20 ఏళ్ల వయసులో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టా. ఈ క్రమంలోనే మంచి సక్సెస్ అందుకున్నా. ఇప్పటికే ఎన్నో యాడ్ ఆఫర్స్ వచ్చాయి. పెద్దపెద్ద బ్రాండ్స్ నన్ను తమ బ్రాండ్ అంబాసిడర్ గా ఆఫర్స్ ఇచ్చారు. నేను వాటిని మంచి గుర్తింపు, కీర్తికి చిహ్నంగా భావిస్తా. కానీ.. కొన్ని బ్రాండ్స్ ప్రమోట్ చేయడం వల్ల అందరికీ నష్టం చేకూరుతుంది. ఇక నాలో నా ఆటో ఇమ్యూని డిజాస్టర్ గుర్తించక ముందు ఆరోగ్యంగా ఉన్నానని భావించా.
అలాగే ఈ బ్రాండ్లను నేనే ఎక్కువగా తినే దాన్ని. వాటి వల్ల ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాను నాకే తెలుసు. ఈ క్రమంలోనే నేను అలాంటి తప్పు చేయకూడదని గ్రహించా. ఇక ఇంటర్నెట్లో చెక్కర్లు కొడుతున్న బ్రాండ్ ప్రమోషన్స్ గురించి మాట్లాడుతూ.. చాలా కాలం క్రితం చేసిన ఎండార్స్మెంట్ నుంచి వచ్చిన యాడ్స్‌లో గత సంవత్సరం నేను దాదాపు 15 ఎండోర్స్‌మెంట్లను రిజెక్ట్ చేసాను. దానివల్ల కోట్లను నష్టపోయా. నేను ఇప్పుడు ఏదైనా బ్రాండ్ ప్రమోట్ చేయడానికి ముందు ముగ్గురు, నలుగురు వైద్యులను తనిఖీ చేస్తా అంటూ సమంత వివరించింది. ప్రస్తుతం సమంత కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి.