విశ్వంభర స్టోరీ లీక్.. 7 లోకాలు, 7 గెటప్‌లు.. సెకండ్‌హాఫ్ కు అదే హైలెట్..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా, త్రిష హీరోయిన్ గా బింబిసారా ఫేమ్ మల్లిడి వశిష్ట ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న మూవీ విశ్వంభర. సోషియా ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూట్ ఇప్పటికే పూర్తయినా.. రిలీజ్ డేట్ మాత్రం సస్పెన్స్ వీడ‌డం లేదు. జూన్లో రిలీజ్ అవుతుందని టాక్ వినిపిస్తున్నా.. టీం నుంచి అసలు క్లారిటీనే లేదు. అదే టైంలో సినిమా కథ గురించి చాలా వార్తలు వైరల్ గా మారుతున్నాయి. స్టోరీ లీక్ అయిందంటూ అసలు కథ ఇదేనంటూ టాక్‌ నడుస్తుంది. ఇలాంటి క్రమంలో డైరెక్టర్ వశిష్ఠ తండ్రి.. నిర్మాత సత్యనారాయణ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అసలు స్టోరీని లీక్ చేశాడు.

Vishwambhara teaser to be out on this date

విశ్వంభర సినిమా మొత్తం చిరంజీవి రేంజ్ లోనే ఉంటుందని.. ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు త‌ర‌హాలో ఎంటర్టైన్మెంట్ తో.. వింటేజ్ చిరుని కూడా చూడొచ్చని వెల్లడించారు. ఇంటర్వెల్ కి ఫాంటసీ ఎలిమెంట్లు వస్తాయని.. తర్వాత నుంచి సినిమా వేరే లెవెల్ లో ఉండబోతుందని.. మూడు గంటల సినిమా అంటే గంటన్నరకు పైగా సీజీ ఉంటుందంటూ వెల్లడించారు. ఏడు లోకాల కథ నడుస్తుందని.. ఏడు గెటప్ లు ఉంటాయని.. కొత్త పాత్రలు వస్తూ ఉంటాయి.. కొత్త ప్రపంచం కనిపిస్తుంది.. అక్కడే సీజీ వర్క్‌ని కూడా ఎక్కువగా చూస్తామంటూ వెల్లడించాడు. అసలు కథ ఇంటర్వెల్ బ్యాంగ్‌ నుంచే ప్రారంభమవుతుందట‌.

మ‌ల్లిడి స‌త్య‌నారాయ‌ణ రెడ్డి కొడుకు ఇన్నాళ్ల‌కు! Great Andhra

దీనికి సంబంధించిన ఎనిమిది భారీ సెట్స్ వేసి మరి.. సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించార‌ని.. 7 లోకాలకు సంబంధించిన సెట్స్ ఇందులో కనిపిస్తాయంటూ చెప్పుకొచ్చాడు. టీజర్ రిలీజ్ టైంలో విమర్శలు ఎదుర్కొన్న క్ర‌మంలో.. మరింత పగడ్బందీగా సిజీ పైర్తి చేసి రిలీజ్ డేట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈనెలాకరకు సీజీ వర్క్ ఫైనల్ అవుట్ ఫుట్ వస్తుందట‌. ఈ క్రమంలోనే టీం మొత్తం సీజీ వర్క్ పైన.. ఫుల్ ఫోకస్ పెట్టారని.. అసలు రాజీ పడే ఉద్దేశం లేదని సత్యనారాయణ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే తాజాగా స్టోరీ ఇదే అని.. ఒక రాక్షసుడు చిన్నపిల్లలను, దేవకన్యలను ఎత్తుకుపోతూ ఉంటాడట‌.

Always Ram Charan (Konidela) 🔵 | Vishwambhara Poster Design Work ❤️‍🔥🔥🥳  @alwaysramcharan 💛 @chiranjeevikonidela Do follow and support  @akki_ramcharan ❤️ #RamCharan... | Instagram

ఈ క్రమంలోనే ఓ దేవకన్య భూమి పైకి వస్తుందట‌. ఆమెకు చిరంజీవితో పరిచయం ఏర్పడడం.. ఇద్దరు ప్రేమించుకుని వివాహం చేసుకోవ‌డం.. అదే సమయంలో రాక్షసుడు భూమి పైకి వచ్చి దేవకన్యను, చిరంజీవికి సంబంధించిన చిన్నపిల్లలను ఎత్తుకొని వెళ్ళిపోతాడని.. వాళ్లను కాపాడేందుకు చిరంజీవి ఆ రాక్షసులతో చేసిన పోరాటమే సినిమా స్టోరీ అని తెలుస్తుంది. మరోవైపు ఏడు లోకాలకు సంబంధించిన‌.. ఏడుగురు రాక్షసులతో చిరంజీవి తలపడతాడని.. ఈ క్రమంలో వచ్చే అన్ని సన్నివేశాలు వీక్స్ లెవెల్ లో ఉంటాయని సమాచారం. విజువల్ పరంగా అద్భుతంగా ఉండనుందని.. విశ్వంభరకు మెయిన్ హైలెట్ అదేనని టాక్‌ నడుస్తుంది. ఇందులో వాస్తవం ఎంతో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.