టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న వారిలో చిరంజీవి ,బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ల పేర్లు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. వీళ్లంతా టాలీవుడ్ లో ఎప్పటినుంచో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఇలాంటి క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న కాజల్ అగర్వాల్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట వైరల్ గా మారుతుంది. కాజల్ అగర్వాల్ గతంలో చిరంజీవి, బాలకృష్ణ లతో కలిసి నటించిన సంగతి తెలిసిందే.
కాగా.. నాగార్జున, వెంకటేష్‌లతో మాత్రం ఈమె ఇప్పటివరకు ఒక్కసారి కూడా నటించలేదు. వెంకటేష్‌తో నటించే అవకాశం రాలేదు. కానీ.. నాగార్జునతో నటించే ఛాన్స్ రెండుసార్లు వచ్చినా వాటిని మిస్ చేసుకుందట కాజల్. చిరు, బాలయ్యతో నటించిన ఈ అమ్మడు.. నాగార్జునతో రెండు సార్లు అవకాశం వచ్చిన మిస్ చేసుకోవడానికి కారణమేంటో.. అస్సలు ఆ సినిమాలో ఏంటో ఒకసారి చూద్దాం. కాజల్ అగర్వాల్.. చిరంజీవి హీరోగా ఖైదీ నెంబర్ 150 సినిమాలో మెరిసింది.
ఇక తర్వాత బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాలో సైతం హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే నాగార్జున హీరోగా రూపొందిన రగడ సినిమాల్లో మొదట కాజల్‌కు అవకాశం వచ్చిందట. అయితే.. చివరి నిమిషంలో ఇది క్యాన్సిల్ కావడంతో ప్రియమణిని సినిమాలో తీసుకొని నటింపజేశారు. అలాగే.. నాగార్జున హీరోగా రూపొందిన మరో సినిమా ది గోస్ట్ సినిమాలోని హీరోయిన్గా కాజల్ అగర్వాల్‌ను భావించారట. కానీ.. అది కూడా ఏవో కారణాలతో చివరి నిమిషంలో రిజెక్ట్ అయింది. అలా నాగార్జున పక్కన రెండు సార్లు కాజల్‌కి అవకాశం వచ్చిన ఆమె లాస్ట్ మినిట్‌లో వాటిని మిస్ చేసుకుంది.