శ్రీహరి గారి ఆస్తులు కోల్పోవ‌డానికి కార‌ణం.. వాడు కనిపిస్తే చంపేస్తా.. డిస్కో శాంతి షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పటి స్టార్ హీరో శ్రీహరికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కేవలం హీరో గానే కాదు.. విలన్ గా, క్యారెక్టర్ అర్టిస్ట్‌గాను తన సత్తా చాటుకున్న ఆయన.. దాదాపు అన్ని జన‌ర్‌ల‌లోను ఆడియన్స్‌ను మెప్పించాడు. రకరకాల పాత్రలను ఇట్టే చేసి ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు. అయితే.. అలాంటి ఓ గొప్ప నటుడు చిన్న వయసులోనే అకస్మాత్తుగా మరణించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ న్యూస్‌ ఇండస్ట్రీని కలచివేసింది. ఆయన అభిమానులను శోక సంధ్రంలో ముంచేసింది. కాగా.. శ్రీహరి భార్య డిస్కో శాంతి సినిమాలకు గుడ్ బై చెప్పేసిన సంగతి తెలిసిందే.

శ్రీహరి కట్టిన తాళి తప్ప సర్వం కోల్పోయా: శాంతి | disco shanti about husband srihari death and financial crisis

ఇలాంటి క్రమంలోనే భర్త శ్రీహరి చనిపోయిన చాలా గ్యాప్ తర్వాత.. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. శ్రీహరి చనిపోయిన తర్వాత పరిస్థితులు ఎలా మారాయో వివరించింది. బావ శ్రీహరి మరణించిన తర్వాత అసలు ఏం చేయాలో దిక్కుతోచలేదని.. బ్రతికున్నప్పుడు నటించిన సినిమాల తాలూకా రెమ్యునరేషన్‌లు చాలామంది ఆయన చనిపోయిన తర్వాత ఎగ్గొట్టేసారు అంటూ వివరించింది. బావ చనిపోయాక ఏడుస్తూ ఓ గదిలో ఉండిపోయా.. చుట్టూ ఏం జరుగుతుందో పట్టించుకోవడమే మానేశా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ క్రమంలోనే శ్రీహరి ఉన్న సమయంలో ఇంట్లో 5 కార్లు ఉండేవని.. వాటిలో జాగ్వర్ కారుకు నెలనెలా ఆయన ఈఎంఐ కడుతూ వచ్చే వాడిని వివరించింది. అయితే శ్రీహరి చనిపోయిన తర్వాత.. మూడు నెలలకే వచ్చి డబ్బు కట్టలేదని కారు తీసుకెళ్లిపోయారని.. ఆ వ్యక్తి పేరు మనోహర్ నాకు బాగా గుర్తుంది. అతను నాకు కనిపిస్తేకచ్చితంగా చంపేస్తా అంటూ అసహనం వ్యక్తుం చేసింది. అతనిపై మండిపడిన శాంతి.. అంతకు ముందు కట్టిన డబ్బులు పోయాయి. కార్ కూడా పోయింది. అలా రెండు కార్లను పోగొట్టుకున్నామంటూ వివరించింది. అంతేకాదు.. ఓసారి ఇంట్లో దొంగతనం జరిగి నగలు పోయాయి.

 

నేను దాన్ని కూడా గమనించుకోలేదు.. మూడు నెలల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశా అసలు ఫలితం లేకుండా పోయిందంటూ వివరించింది. ఉన్న అప్పులు తీర్చి అవసరానికి బంగారం తాకట్టు పెట్టి.. అప్పులు లేకుండా చేసుకున్నానని.. ఇప్పుడిప్పుడే కొంచెం కుదుటపడుతున్నామంటూ వివరించిన డిస్కో శాంతి.. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు.. ఇకపై సినిమా అవకాశాలు వస్తే మంచి పాత్రలైతే ఖచ్చితంగా చేయాలని అనుకుంటున్నా.. బాధ మర్చిపోవడానికి సినిమాల్లో నటించాలని భావిస్తున్నా అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం డిస్కో శాంతి చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి.