చిరు మూవీ ఫ్లాప్ టాక్.. ఏడుస్తూ ట్యాంక్ బండ్ మీదకి స్టార్ డైరెక్టర్.. కట్ చేస్తే..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి మోస్ట్ లకీ ఎస్ట్ ఏడాది అంటే 1983. అప్పటివరకు సాధారణ హీరోగా ఉన్న చిరంజీవిని.. ఒక్కసారిగా స్టార్ హీరోగా మార్చిన ఖైదీ సినిమా వచ్చింది ఆ ఏడాదిలోనే. ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి నటన, డ్యాన్స్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ మూవీలో త‌న మేనరిజంతో కూడా ఆడియన్స్ను ఫిదా చేశాడు చిరు. ఇక అదే ఏడాది ప్రారంభంలో ఆయన కెరీర్‌లో మరో మ్యాజిక్ జరిగింది. అదే.. అభిలాష మూవీ. మరణశిక్షణ రద్దు చేయాలని కాన్సెప్ట్ రూపొందిన ఈ సినిమాలో రాధిక హీరోయిన్గా, రావు గోపాలరావు విలన్ పాత్రలో న‌టించ‌గా కోదండ‌రామిరెడ్డి డైరెక్షన్లో తెర‌కెక్కింది.

ఒక్క ప్లాప్ కోసం చాలా రోజులు ఎదురుచూసా : కోదండరామిరెడ్డి | Director  Kodandarami Reddy says interesting facts about his career

ఇక‌ ఈ సినిమాకి యండమూరి వీరేంద్రనాథ్ కథను వినిపించాడు. ఇక ఆ మూవీ అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఇక ఈ సినిమాలో చిరంజీవి ప్రతిభతో పాటు.. కోదండరామిరెడ్డి టాలెంట్ కూడా అందరికీ అర్థమైంది. అభిలాష సినిమా తనకు లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ అని.. కోదండరామిరెడ్డి ఓ సందర్భంలో వివరించారు. దీని ముందు కోదండ రామిరెడ్డి తెఉర‌కెక్కించిన‌ రెండు మూడు సినిమాలు దారుణంగా ప్లాప్ అయ్యాయని.. దీంతో ఒక సినిమాతో నన్ను హీరోగా ఎంపిక చేసి ఆ తర్వాత తొలగించారు. నాకు ఒక మాట కూడా చెప్పకుండా మరొక దర్శకుడు తో ఈ సినిమాను అనౌన్స్ చేసి రూపొందించారు.

Abhilasha Full Length Telugu Movie

అప్పుడు నేను చాలా బాధపడ్డా. కన్నీళ్లు పెట్టుకున్నా. తర్వాత అభిలాష సినిమాతో మరో అవకాశం వచ్చింది.. రిలీజ్ కి కొన్ని రోజుల ముందు చెన్నైలో ఈ సినిమా రివ్యూ ప్రదర్శించారు. ఆ టైంలో నెక్స్ట్ సినిమా కోసం పనిచేస్తూ హైదరాబాదులో ఉన్న నేను.. చెన్నైలో రివ్యూ నా భార్యను కనుక్కోమన్న. మిగిలిన సెలబ్రిటీలు, అలాగే సినిమా చూసిన వాళ్ళ రెస్పాన్స్‌ను ఆమె తెలుసుకుంది. ఈ సినిమా కూడా బాగోలేదు అంటున్నారండి అని తను చెప్పుకొచ్చింది. నాకు నిజంగా ఏం చేయాలో అర్థం కాలేదు. నేను, నాతోపాటు యండమూరి వీరేంద్రనాథ్ ఇద్దరం ఏడుస్తూ ట్యాంక్ బండ్ పై అలా కూర్చుని పోయెమ్. చాలా సేపు బాధపడ్డాం. కానీ.. సినిమా రిలీజ్ అయిన తర్వాత యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్‌ని తెచ్చుకుంది. పెద్ద మ్యాజిక్ జరిగింది. అభిలాష అద్భుతమైన సక్సెస్ అందుకుంది అంటూ కోదండరామిరెడ్డి వెల్లడించారు.