మహేష్ బాబు, మణిశర్మ మధ్య గ్యాప్ కు కారణం అదేనా.. తప్పు ఎవరిదంటే..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలను ఖాతాలో వేసుకున్న మహేష్.. ఫ్లాప్ సినిమాలను కూడా మూటకట్టుకున్నారు. అయితే ఆయన సినిమాలో ఫ్లాప్ గా నిలిచిన సినిమాలు సైతం మ్యూజికల్ హిట్గా నిలిచిన సందర్భాలు ఉన్నాయి. మ్యూజిక్ వల్లే హిట్ అయిన సినిమాలు ఉన్నాయి. కాగా.. మహేష్ కెరీర్ ప్రారంభం నుంచి ఆయనకు ఎన్నో సినిమాల్లో సక్సెస్ఫుల్ మ్యూజిక్ అందించి.. మ్యూజికల్ హిట్లుగా నిలపాడు మణిశర్మ. వీరిద్దరి కాంబోలో వచ్చిన దాదాపు అన్ని సినిమాలు మ్యూజికల్ హిట్లుగా నిలిచాయి.

mahesh babu: Got numerous Bollywood offers, but didn't feel the need to  cross over, says Telugu superstar Mahesh Babu - The Economic Times

ఆ సాంగ్స్ ఇప్పటికీ సూపర్ హిట్గా మారుమోగుతూనే ఉన్నాయి. మరి ఇంతలా బ్లాక్ బ‌స్టర్ కాంబినేషన్‌గా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న మహేష్, మణిశర్మల మధ్య గ్యాప్ ఎందుకు వచ్చింది.. ఖలేజా, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తర్వాత వీరిద్దరి కాంబోలో ఒక్క సినిమా కూడా రాకపోవడానికి కారణం ఏంటి.. ఎంతో క్లోజ్ గా మంచి స్నేహితులుగా ఉండే వీళ్ళ మధ్యన ఈ గ్యాప్ కు కారణం ఎవరు.. తప్పు ఎవరిది.. అనే సందేహాలు అందరిలోనూ ఉన్నాయి. అయితే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాంలో పాల్గొన్న మణిశర్మ వీట్లపై క్లారిటీ ఇచ్చారు. మహేష్ బాబుతో గ్యాప్ గురించి ఆయన మాట్లాడుతూ.. ఏం జరిగిందో నాకు తెలియదు.

Mani Sharma | Spotify

ఎందుకు దూరం పెట్టారో కూడా అర్థంకాలేదు. మా ఇద్దరి కాంబోలో బ్లాక్ బస్టర్ హీట్ లు ఉన్నాయి. ఎక్కడ పొరపాటు జరిగిందో.. నాకు కూడా తెలియదు అంటూ వివరించాడు. మేబి నాదే తప్పయుండొచ్చు.. అందుకే ఇలా జరుగుతుందేమో.. కానీ నేను ఆ తప్పేంటో తెలుసుకోవాలని ప్రయత్నించలేదు. వాళ్ళు కూడా నాకు ఏమీ చెప్పలేదు. గ్యాప్ మాత్రం కొనసాగుతూనే ఉంది అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే మణిశర్మ కామెంట్స్ వైరల్ కావడంతో.. మహేష్ ఫ్యాన్స్ మీరిద్దరు కాంబోలో మళ్ళీ ఓ సినిమా వస్తే కచ్చితంగా మ్యూజికల్ బ్లాక్ బ‌స్టర్ అవుతుందంటూ,, మహేష్ తన సినిమాల‌ కోసం మణిశర్మన్న తీసుకుంటే బాగుంటుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.