నందమూరి కుటుంబానికి.. తెలుగు సినీపరిశ్రమకు ఉన్న అనుబంధం ఇప్పటిది కాదు. నందమూరి నటసార్వభౌమ తారకరామారావు దగ్గరనుంచి ఈ అనుబంధం కొనసాగుతుంది. ఆయన తర్వాత హరికృష్ణ, బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇలా ఆయన వారసత్వాన్ని పునికి పుచ్చుకునే ఇండస్ట్రీలో నటులుగా రాణిస్తున్నారు. కుటుంబ పెద్ద స్వర్గీయ ఎన్టీ రామారావు 1996లో కాలం చేయగా.. ఆయన లేకపోయినా తన సినీ వారసత్వాన్ని కుటుంబం మొత్తం కలిసి పంచుకున్నారు. కాగా ఓ సినిమాను కలిసి నిర్మించాలని అంతా ఫిక్స్ అయ్యారట. అదే బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ శరత్ నేతృత్వంలో తెరకెక్కిన పెద్దన్నయ్య మూవీ.
రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్ పై నందమూరి రామకృష్ణ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా 1997లో రిలీజై మంచి సక్సెస్ అందుకుంది. భారీ కలెక్షన్లను కొల్లగొట్టి లాభాల వర్షం కురిపించింది. అయితే ఈ సక్సెస్ కు కారణం నేను ఒక్కడినే కాదని.. నందమూరి కుటుంబం అంతా కలిసి ఈ సినిమాను రూపొందించామంటూ ప్రొడ్యూసర్ రామకృష్ణ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. పెద్దన్నయ్య సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో నటించాడని.. అందులో పెద్దన్నయ్య పాత్ర మేకప్ టెస్ట్ చేస్తున్నప్పుడు.. పంచకట్టులో బాలయ్య నాన్నగారిలా కనిపించాడని.. అప్పుడే ఈ సినిమా పెద్ద సక్సెస్ అని ఫిక్స్ అయ్యాం.

నాన్నగారే అదృస్య శక్తిలా పైనుంచి వచ్చి ఈ సినిమా గొప్ప సక్సెస్ అయ్యేలా చూసారు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక.. తన పెద్దన్నయ్య రామకృష్ణ 1962లోనే కాలం చేశారని.. ఆయన తర్వాత పుట్టిన రామారావు గారి సంతానం జయకృష్ణ, లోకేశ్వరి, సాయి కృష్ణ, హరికృష్ణ, మోహనకృష్ణ.. సినిమాటోగ్రాఫర్, పురందేశ్వరి, బాలకృష్ణ ,భువనేశ్వరి, రామకృష్ణ, ఉమామహేశ్వరి, జయశంకర్ కృష్ణ అంతా కలిసికట్టుగానే ఉన్నామని.. ఈ క్రమంలోనే మేమంతా కలిసి సినిమాను రూపొందించి మంచి సక్సెస్ అందుకున్నామని ఆయన చెప్పుకొచ్చాడు. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ మోహన్ కృష్ణ అన్నయ్య అని రామకృష్ణ స్టూడియోస్ లో నిర్మించిన అన్ని సినిమాలకు ఆయన సినిమా ఆటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు అంటూ వివరించారు.