టాలీవుడ్ లో మంచు ఫ్యామిలీ తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల మంచు మనోజ్ కుటుంబ సభ్యుల మధ్యన జరుగుతున్న వార్ నెటింట హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. తాజీగా మంచు మనోజ్ జల్‌పల్లి లోని.. మోహన్ బాబు నివాసం వద్ద గేట్ దగ్గర కూర్చుని నిరసనలు చేయడం.. రచ్చ రచ్చ చేయడం ఇటీవల మనం చూస్తూనే ఉన్నాం. మంచు మనోజ్ చెప్పే దాంట్లో ఎంత వాస్తవం ఉందో తెలియదు కానీ.. విష్ణు కావాలని ఇదంతా చేస్తున్నాడని.. నన్ను ఇలాంటి పరిస్థితికి రప్పించాడని వివరించాడు.
నా తండ్రికి మాయ మాటలు చెప్పి.. నా జుట్టు తన చేతిలో ఉండాలని విష్ణు ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నాడని.. మా తండ్రి కూడా దానికి ఒప్పుకోవడంతో ఈ పరిస్థితి వచ్చిందంటూ మనోజ్ వెల్లడించాడు. అన్న కోసం ఎన్నో సినిమాలు ఫ్రీగా చేశా.. నాన్న కూడా అన్న బాగుండాలని ఎప్పుడూ చూశారు.. నా బాబు కోసం ఎప్పుడూ ఆలోచించలేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇక నేను ఆస్తుల కోసం గొడవలు మొదలుపెట్టలేదు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇలాంటి నిరసనలు చేయవలసి వస్తుంది. కాలేజ్ పిల్లల భవిష్యత్తుతో విష్ణు ఆడుకుంటున్నాడు. తప్పని చెబితే ఇంట్లో నుంచి గెంటేశారు. నన్ను దూరం పెట్టారు. ఇప్పటికే నాపై ఎన్నో కేసులు పెట్టారు.
ముఖ్యంగా నా భార్య ఈ గొడవలు అన్నింటికి కారణం అని నాపై కంప్లైంట్ చేసి.. ఎఫ్ఐఆర్‌లో నా భార్య పిల్లల పేర్లు కూడా చేర్చారు. ఇది నాకు చాలా బాధ కలిగించింది. నేను ఇంత పెద్ద గొడవ చేయడానికి అది కూడా ఒక కారణం. నా భార్య, పిల్లల్ని కూడా ఇందులో లాగడం నేను అసలు సహించను.. విష్ణు తాను చేసి తప్పులన్నీ కప్పిపుచ్చుకోవడానికి మా నాన్నను తన చేతుల్లో పట్టుకున్నాడు.. విష్ణు చెప్పినట్లే నాన్న కూడా ఆడుతున్నాడు.. చిన్నప్పటి నుంచి విష్ణుకి నేనంటే చాలా కుళ్ళు అంటూ మనోజ్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం మనోజ్ చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి.