కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు.. పూనమ్ ఘాటు కామెంట్స్ పవన్ గురించేనా..?

ఒకప్పటి సీనియర్ స్టార్ బ్యూటీ పూనం కౌర్‌కు టాలీవుడ్ లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. గతంలో స్టార్ హీరోలు సినిమాలో నటించి ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. మెల్లమెల్లగా అనివార్య కారణాలతో ఇండస్ట్రీకి దూరమైంది. అయితే ఈ అమ్మ‌డు సినిమాలకు దూరమైనా.. ఇప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు కాంట్రావ‌ర్షియ‌ల్‌ కామెంట్స్‌తో హాట్‌ టాపిక్‌గా మారుతుంది. ముఖ్యంగా.. టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఆమె చేసే పోస్టులు నెటింట సంచలనం సృష్టిస్తూ ఉంటాయి.

కచ్చితంగా వీళ్ళని ఉద్దేశిస్తూ.. నెలలో ఐదు సార్లు అయినా.. ఇన్ డైరెక్ట్ పోస్ట్లు పెడుతూ ఉంటుంది పూనం. ఈ క్రమంలోని తాజాగా.. ఆమె చేసిన మరో సంచలన పోస్ట్ నెటింట హాట్‌ టాపిక్‌గా ట్రెండ్‌ అవుతుంది. దీంతో.. పవన్ ఫ్యాన్స్ ఆమెపై ఫెయిర్ అవుతున్నారు. ఇంతకీ ఆమె చేసిన ఆ పోస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. పవన్ కుమారుడు మార్క్ శంకర్ తాజాగా అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. సింగపూర్‌లో మార్క్ శంకర్ స్కూల్ కి వెళ్ళిన టైం లో అగ్ని ప్రమాదం సంభవించడంతో.. కాళ్లు అలాగే చేతులకు పెద్ద గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లో పొగ పట్టినట్లు స్వయంగా పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

అయితే పవన్ కొడుకు ఆపదలో ఉన్న క్రమంలో.. టాలీవుడ్ సెలబ్రిటీస్, అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప‌లు రాజ‌కీయ నాయ‌కులు సైతం దీనిపై రియాక్ట్ అవుతూ మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని పోస్ట్లు చేశారు. ఇలాంటి క్రమంలో పూనం కౌర్ చేసిన వివాదాస్పద ట్విట్ వైరల్ గా మారుతుంది. కర్మ ఎవరిని వదిలిపెట్టదు.. దానికి ఎప్పుడు ఏం చేయాలో తెలుసు.. అంటూ ఓ పోస్ట్‌ షేర్ చేసింది. చిన్న గాయాలకు నగరం అంతా ఉలిక్కిపడుతుంది.. పెద్ద నేరాలు జరిగిన అంతా మౌనంగా ఉండిపోతారు.. అంటూ సెన్సేషనల్ పోస్టులు పూనమ్ కౌర్ షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఇది వివాదంగా మారింది.