టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ సినిమాలలో సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ ప్రాజెక్టు కూడా ఒకటి. ఫుల్ ఆఫ్ యాక్షన్ అడ్వంచరస్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో.. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుక్కుమారాన్ కీలకపాత్రలో మెరవనున్నారు. ఇక కీరవాణి సంగీతం అందిస్తుండగా.. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై డాక్టర్ కే.ఎల్.నారాయణ ఏకంగా 1000కోట్ల భారీ బడ్జెట్ సినిమాను రూపొందిస్తున్నారు. వచ్చే ఏడాది చివరికల్లా సినిమా పూర్తి చేసి రిలీజ్ చేయాలని ప్లాన్ లో ఉన్నారట టీం. కాగా మహేష్ ఇప్పటి వరకు తన కెరీర్‌లో 28 సినిమాల్లో నటించగా.. రాజమౌళికి మాత్రం ఆయన సినిమాల్లో ఒకే ఒక్క సినిమా అంటే చాలా ఇష్టమట.
ఇంతకీ.. అన్ని బ్లాక్ బస్టర్‌లు అందుకున్న మహేష్ సినిమాల్లో.. జక్కన్నకు నచ్చిన ఏకైక మూవీ మరేదో కాదు.. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన బిజినెస్ మాన్ సినిమా. ఇక ఇందులో నన్ను రౌండ్అప్ చేయొద్దు.. రౌండ్అప్ చేస్తే కన్ఫ్యూషన్ లో ఎక్కువగా కొట్టేస్తా అంటూ మహేష్ రౌడీ లకు వార్నింగ్ ఇచ్చే తీరు అప్పట్లో ఆడియన్స్ను తెగ ఆకట్టుకుంది. రాజమౌళికి సైతం ఈ డైలాగ్ ఇష్టమట. అంతేకాదు ఈ సినిమాలో మహేష్ బాబుది కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అయినా తన నటనతో ఆకట్టుకున్నాడు.ఇక మహేష్ బాబు క్యారెక్టర్ ఒక్కటే ఈ సినిమాను సక్సెస్ చేసిందన అభిప్రాయాలు సైతం వినిపించాయి.
ఇక ఈ సినిమా జక్కనను ఆశ్చర్యానికి గురి చేసిందట. ఇక ఈ సినిమా కంటే ముందు జక్కన్న ఓ పుస్తకాన్ని రాసుకున్నాడట. సినిమా ఎలా హిట్ చేయాలి..? హిట్ అవ్వాలంటే ఏం చేయాలి.. అనే విషయాలు ఆ పుస్తకంలో నోట్ చేసుకున్న జక్కన్న.. బిజినెస్ మాన్ సినిమా తర్వాత ఆ పుస్తకాన్ని చించి విసిరేసాడట. తను రాసిన దానికి విరుద్ధంగా తెరకెక్కిన మహేష్ సినిమా హిట్ అవడంతో సినిమా హిట్ అవ్వడానికి కొన్ని కారణాలు కాదు.. ఎన్నో రకాల కారణాలు ఉంటాయనే ఉద్దేశంతో ఆ పుస్తకాన్ని చించేశాడని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. యాంకర్ రాజమౌళి గురించి ఏదైనా చెప్పమని ఇంటర్వ్యూవర్ అడగగా.. ఆర్జీవి ఈ విషయాలను చెప్పుకొచ్చాడు. రాజమౌళి లాంటి డైరెక్టర్ ఇంతవరకు ఫ్లాప్ ఇవ్వకుండా సినిమాలు చేస్తున్నాడు. ఆయనకు సినిమా ఎలా హిట్ చేయాలన్నది బాగా తెలుసు అంటూ వర్మా కామెంట్లు చేశాడు.