సూపర్ స్టార్ రజనీకాంత్ కేవలం కోలీవుడ్‌లోనే కాదు.. టాలీవుడ్‌లోను తిరుగులేని ఇమేజ్ సంపాదించుకొని కోట్లాదిమంది అభిమానాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియన్ సినిమాలు ఇంకా ఇండస్ట్రీకి పరిచయం కాకముందే.. పాన్ ఇండియా లెవెల్‌లో హీరోగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. రజినీకాంత్ ఇక ఏడుపదుల వయసు మీద పడినా ఇప్పటికీ అదే ఎనర్జీ, మేనరిజంతో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటూ వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం కూలి, జైలర్ 2 సినిమా షూట్‌లలో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈనెల తన సినీ కెరీర్‌లో రజనీకాంత్ వివాదాలకు దూరంగానే ఉంటున్నారు. గతంలో మాత్రం సీఎం జయలలితపై ఆయన వ్యతిరేకత వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే ఆమెతో రజనీకి విభేదాలు తలెత్తాయంటూ ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే.. దాదాపు 30 ఏళ్ల తర్వాత ఇటీవల మళ్ళీ ఆ వివాదంపై ఆయన స్పందించాడు. స్టార్ ప్రొడ్యూసర్, పొలిటిషన్ అయిన ఆర్‌వీఎం వీరప్పన్‌కు కోలీవుడ్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక ఆయన లైఫ్ జర్నీని ఆధారంగా చేసుకుని రూపొందిన ఆర్‌వీఎం కింగ్ మేకర్ డాక్యుమెంటరీలో రజనీకాంత్ కూడా పార్ట్నర్షిప్‌ని వహించారు. ఈ సందర్భంలోనే.. నిర్మాత వీరప్పన్‌తో తనకున్న రిలేషన్, స్నేహాన్ని గుర్తుచేసుకున్న రజినీ.. వాళ్ళ కాంబినేషన్‌లో అప్పట్లో భాష సినిమా వచ్చి.. 100 డేస్ కంటే ఎక్కువగా ఆడిందంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమా 100 డేస్ ఫంక్షన్ చెన్నైలోని ఓ వేదికపై గ్రాండ్గా నిర్వహించారు. వీరప్పన్ కూడా ఇందులో పాల్గొన్నాడు.
అప్పట్లో ఆయన అన్న డీఎంకే ప్రభుత్వంలో మంత్రి పదవిలో కొనసాగుతున్నాడు. ఈ సక్సెస్ మీట్లో రజినీకాంత్ మాట్లాడుతూ.. బాగా బాంబ్ కల్చర్ పెరిగిపోయిందంటూ చేసిన కామెంట్స్ అప్పట్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ సినిమా హీరోనే.. ప్రభుత్వంపై పుల్లవిరుపు కామెంట్లు చేస్తున్నప్పుడు.. మంత్రి వీరప్పన్ ఎందుకు నోరు విప్పలేదు అంటూ విమర్శలు కురిపించారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న జయలలిత.. వీరప్పన్ పదవిపై వేటు వేసి.. ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించింది. ఈ విషయం తెలుసుకున్న రజనీకాంత్ వెంటనే బాధపడి.. నా వల్ల మీ పదవి పోయింది.. నేను జయలలితకు కాల్ చేసి మాట్లాడుతా అని వివరించాడట. దానికి వీరప్పన్.. నీ ఆత్మ గౌరవాన్ని కోల్పోవద్దు. నాకు పదవులు అలాంటివి ఏమీ అవసరం లేదని సరాసరి చెప్పేసాడట. ఆ తర్వాత ఆయన సాధారణ జీవితం గడుపుకుంటూ రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యాడని రజినీకాంత్ వివరించాడు. 30 ఏళ్ల కింద జరిగిన ఈ సంఘటన ఆయన మరోసారి గుర్తు చేసుకోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.