టాలీవుడ్ పవర్ స్టార్.. ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్‌కి ఎలాంటి పరిచయాలు అవసరం లేదు. సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. తన పిల్లలకు తనకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలతో పాటు.. అప్పుడప్పుడు మూగజీవాలపై జరిగే అన్యాయాల పట్ల కూడా గళం విప్పుతుంది. అంతేకాదు.. వివాదాలకు చాలా దూరంగా ఉండే రేణు దేశాయ్.. పలు సందర్భాల్లో మాత్రం ఆకతాయిలో కామెంట్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చి వారి నోరు మూయిస్తుంది.
అయితే.. పవన్ కళ్యాణ్‌తో విడాకుల తర్వాత రేణు దేశాయ్ మరొకరిని వివాహం చేసుకోలేదన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె రెండో వివాహం చేసుకోకపోవడం పై రియాక్ట్ అయింది. గతంలో రేణు ఓ వ్యక్తిని వివాహం చేసుకోవడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. వారికి సంబంధించిన పిక్స్ కూడా అప్పట్లో తెగ వైరల్ గా మారాయి. అయితే నిశ్చితార్థమైన తర్వాత ఆ వివాహానికి క్యాన్సిల్ చేసుకుంది రేణు. తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో దీనిపై రియాక్ట్ అయ్యింది.
నేను మరో వ్యక్తిని వివాహం చేసుకొని రిలేషన్ షిప్ లోకి వెళ్లాలనుకున్నా కానీ.. పిల్లలకు సరిగా న్యాయం చేయలేకపోతున్నాను అనే ఆలోచన వచ్చింది.. వెంటనే కొత్త రిలేషన్‌షిప్ పెట్టుకోవాలన్న ఆలోచనను ఆపేసా. నా పిల్లలు ఎదుగుతున్న టైంలో నేను వేరే వారితో ఇంకొక లైఫ్ జీవించాలి అనుకుంటే.. వాళ్లకు సమయం ఇవ్వలేను అందుకే మరో రిలేషన్ షిప్ లోకి వెళ్లలేదంటూ చెప్పుకొచ్చింది రేణు దేశాయ్. అంతేకాదు తన కూతురు ఆద్యకు 18 ఏళ్లు దాటి.. తన పనులు తానే చేసుకుని సొంతంగా బిజీ అయిన తర్వాత.. రెండో పెళ్లి గురించి ఆలోచిస్తా అంటూ ఇన్ డైరెక్ట్ గా అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.