కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, సౌందర్య హీరోయిన్‌గా.. రమ్యకృష్ణ నెగిటివ్ రోల్‌లో నటించిన నరసింహ సినిమా అప్పట్లో ఎలాంటి సక్సెస్ అందుకున్న ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్టర్ కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాల్లో రజనీకాంత్, సౌందర్య పాత్రల కంటే అత్యంత హైలెట్ అయిన పాత్ర నీలాంబరి రోల్. ఈ పాత్రలో రమ్యకృష్ణ ఒదిగిపోయిన నటించింది అనడంలో సందేహం లేదు. అపట్లో టాప్ స్టార్ హీరోయిన్గా వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా రాణిస్తున్న క్రమంలో అలాంటి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో విలన్ గా నటించాలంటే కచ్చితంగా నో చెప్పేస్తారు.
కానీ.. రమ్యకృష్ణ మాత్రం ఈ పాత్రను ఒప్పుకొని పెద్ద సాహసమే చేసింది అని చెప్పాలి. అంతేకాదు.. ఈ పాత్రలో తాను ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. తాను తప్ప.. మరెవరు ఇలాంటి పాత్రలో నటించలేరు అనేంతల ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. అయితే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన నీలాంబరి రోల్ గురించి డైరెక్టర్ రవికుమార్ పలు ఇంట్రస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. మొదట్లో రవికుమార్ తమిళ్లో పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో నటిస్తూ మెల్లమెల్లగా డైరెక్టర్గా అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలకు దర్శకత్వం వహించి తన సత్తా చాటుకున్నాడు. అయితే.. తాజాగా రవికుమార్ ఓఇంటర్వ్యూలో నీలాంబరి పాత్ర గురించి మాట్లాడుతూ.. ఓ హీరోయిన్ ని చూసి నీలాంబరి పాత్రను సృష్టించానని వెల్లడించాడు.
ఆమె ఎవరో కాదు మాజీ ముఖ్యమంత్రి అలనాటి స్టార్ బ్యూటీ జయలలిత అంటూ వివరించాడు. ఇక 1999 లో రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం సినిమాకు మరింత హైలెట్ అనడంలో అతిశయోక్తి లేదు. అప్పట్లో కూడా జయలలిత సీఎంగా ఉన్న సమయంలో ఈ సినిమాపై తను రియాక్ట్ అయిందని.. కానీ నన్ను మాత్రం ఏమీ అనలేదు అంటూ చెప్పుకొచ్చారు డైరెక్టర్. ఇలా.. వైవిధ్యమైన పాత్రలో నరసింహ సినిమాతో తన సత్తా చాటుకున్న రజినీకాంత్, రమ్యకృష్ణ చాలా గ్యాప్ తర్వాత మరోసారి కోలీవుడ్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో జైలర్ సినిమాలో నటించి అదే రేంజ్ లో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. మళ్లీ మరోసారి జైలర్‌సిక్వెల్‌లో కలిసి నటిస్తున్నారు. ఇక ఇప్పటికే.. సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.