టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా.. తర్వాత స్టార్ హీరోగా ఎదిగాడు మెగాస్టార్ చిరంజీవి. తాను నటించిన ఎన్నో సినిమాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్ లు అందుకున్న చిరు.. తన కెరీర్ లోనే ఎన్నో బిరుదులను దక్కించుకున్నాడు. ఆయన నటన, డైలాగ్ డెలివరీనే కాదు.. డ్యాన్స్ గురించి కూడా ఇప్పటికీ ఎంతోమంది ప్రత్యేకంగా ప్రస్తావించి మరి ప్రశంసలు కురిపిస్తారు. చిరంజీవి డ్యాన్స్‌లో గ్రేస్.. టాలీవుడ్ కే కొత్త పందాలు తీసుకువచ్చింది. అలా.. డ్యాన్స్‌లో టాలీవుడ్ నెంబర్ వన్‌గా మారిన మెగాస్టార్.. ఓ సినిమా షూట్ టైంలో డ్యాన్స్ వేయలేక స్పృహ తప్పి పడిపోయాడట.
ఇంతకీ ఆ సినిమా ఏంటో.. అసలు ఏం జరిగిందో.. ఒకసారి తెలుసుకుందాం. ఇక మెగాస్టార్ కెరీర్ ప్రారంభం నుంచి పని రాక్షసుడని అంత అంటూ ఉండేవారు. ఇక ఇప్పటికీ అలాగే కష్టపడతారు మెగాస్టార్. దానికి ఉదాహరణ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ సంఘటన. ఆ రోజుల్లో చిరంజీవి, రాఘవేంద్రరావు, శ్రీదేవి కాంబోలో జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా వచ్చి ఎలాంటి సక్సెస్ అందుకుందో.. ఎంత పెద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచిందో తెలిసిందే. ఇప్పటికీ సినిమాలోని సాంగ్స్ ఒక పాట మినహా.. మొత్తం పూర్తయిపోయిందట. మేకర్స్ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేసారు. ఒక పాట షూటింగ్ చేయాలి లేకపోతే విడుదల వాయిదా పడాల్సి వస్తుంది. కథకి లింక్ అయినా ఈ సాంగ్ ఆపేసి సినిమా రిలీజ్ చేసేందుకు కూడా వీలు లేదు.
ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి కి మలేరియా వచ్చింది 103 జ్వరంతో ఇబ్బంది పడుతున్నా కూడా.. తనకు బాగోలేదు కదా అని షూటింగ్ వాయిదా వేయకుండా చిరంజీవి సెట్స్ లో పాల్గొన్నాడట .నిర్మాతకు కోట్లల్లో నష్టం వాటిల్లుతుంది.. విడుదల వాయిదా పడుతుంది.. నా వల్ల ఎవరికి ఒక్క పైసా కూడా నష్టం రాకూడదనే ఉద్దేశంతో చిరంజీవి అంత హై ఫీవర్ లోనో షూటింగ్లో పాల్గొన్నారు. తనతో పాటు డాక్టర్ని తెచ్చుకొచ్ఉకున్న చిరంజీవి.. సాంగ్ షూట్ టైంలో ఎన్నో సార్లు అదుపుతప్పి పడిపోయేవాడట. ఎట్టకేలకు అంత ఫుల్ ఫీవర్ లోనో షూటింగ్ పూర్తి చేసిన చిరు.. పాట పూర్తయిన వెంటనే స్పృహ తప్పి పడిపెఓయాడట. ఆయనను వెంటనే హాస్పిటల్‌కి జాయిన్ చేసి.. దాదాపు 15 రోజులు తర్వాత చిరంజీవి మళ్ళీ కోలుకున్నాడు. మెగాస్టార్ కి సినిమా మీద ఎంతటి డెడికేషన్ ఉందో చెప్పడానికి ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి.