టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్రిపుల్ ఆ తర్వాత గ్లోబల్ స్టార్ ఇమేజ్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం రామ్ చరణ్.. బుచ్చిబాబు సనా డైరెక్షన్‌లో పెద్ది సినిమా షూట్లో సందడి చేస్తున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా.. చరణ్ పుట్టినరోజు సందర్భంగా సినిమా టైటిల్ అనౌన్స్ చేసిన ప్రొడ్యూసర్.. శ్రీరామనవమి సెలబ్రేట్ చేస్తూ ఫస్ట్ షార్ట్ గ్లింప్స్ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. గడ్డం, చెవి, ముక్కు పోగులతో ఊర మాస్ లుక్‌లో ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించాడు. అంతేకాదు.. ఆయన మేనరిజం, యాస కూడా ఆడియన్స్‌ను విపరీతంగా మెప్పించింది. ఈ క్రమంలోనే గ్లింప్స్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
ఈ క్రమంలో నిన్నటి వరకు బుచ్చిబాబు డైరెక్షన్ పై మెగా అభిమానుల్లో సందేహాలు ఉన్న.. గ్లింప్స్‌తో చరణ్ బ్లాక్ బస్టర్ కొట్టేస్తాడని క్లారిటీ వచ్చేసింది. ఇక గ్లిఇంప్స్‌లో క్రికెట్ గేమ్ ని ప్రధానంగా చూపించిన టీం.. ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించారు. అయితే ఇందులో క్రికెట్ మాత్రమే కాదని.. మరో బిగ్ సర్ప్రైజ్ ఉండబోతుందని సమాచారం. ఈ మూవీ క్రికెట్‌తో పాటు.. రెస్లింగ్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతుందట. ఇవి రెండు పెద్ది సినిమాకు హైలెట్గా నిలవనున్నాయని.. ఇంతవరకు చూడని మేనరిజంతో, వైవిధ్యమైన బాడీ లాంగ్వేజ్‌తో చరణ్ కనిపించి అదరహో అనిపించుకుంటాడని ఇన్సైడ్ వర్గాల సమాచారం. అంతేకాదు.. సినిమాలో మరిన్ని ట్విస్ట్‌లు ఉండబోతున్నాయని.. ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్ ఖాయమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
క్రికెట్, కుస్తీ ఎపిసోడ్లతో పాటు.. చరణ్ పై షూట్ చేసిన ఫైట్ సీన్స్ కూడా ఆడియన్స్‌కు గూస్ బంప్స్ తెప్పిస్తాయని సమాచారం. ఇప్పటివరకు కేవలం 30 శాతం పూర్తిచేస్తున్న ఈ సినిమా క్రికెట్ మ్యాచ్ కు ఎమోషన్ ను జోడించి చరణ్ క్యారెక్టర్ ను డిజైన్ చేసిన తీరు సినిమాకి హైలెట్గా నిలవనుందట. ఇక ఇప్పటికే మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ నెట్‌ఫ్లిక్స్ సంస్థ భారీ మొత్తానికి చేజెక్కించుకున్న సంగతి తెలిసిందే. గ్లింప్స్ కి భారీ క్రేజ్ ఏర్పడుతున్న క్రమంలో.. ఏరియా వైడ్ బిజినెస్‌ను కూడా.. ఇంకా హోల్డ్‌లోనే పెట్టినట్లు తెలుస్తుంది. సినిమా పూర్తి అయిన తర్వాత ఏరియాల వారీగా అప్పుడున్న క్రేజ్ రిత్యా బిజినెస్ క్లోజ్ చేయాలనే ప్లాన్‌లో టీం ఉన్నట్లు సమాచారం.