శ్రీదేవితో పెళ్లి నేను అందుకే రిజెక్ట్ చేశా.. నటుడు మురళి మోహన్

ఒకప్పటి సీనియర్ స్టార్ హీరో మురళీమోహన్ కు టాలీవుడ్ ఆడియన్స్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మొదట వ్యాపారంలో రాణించిన మురళీమోహన్.. తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే వరుస‌ సినిమాలో నటిస్తూ సత్తా చాటుకున్న ఆయన.. మెల్లమెల్లగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గాను మారీ ఇండస్ట్రీలో రాణించారు. జగమే మాయ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. తిరుగులేని స్టార్‌డం సంపాదించుకున్న మురళీమోహన్.. మా అసోసియేటివ్ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించాడు. సినీ రంగంతో పాటు పాలిటిక్స్ లోకి అడుగుపెట్టి.. తనదైన ముద్ర వేసుకున్నాడు.

Murali Mohan Interview : ఇష్టపడ్డాను... కష్టపడ్డాను..! | Murali Mohan  Interview

ఎంపీగా ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టిన ఆయన.. మరోవైపు వ్యాపారవేత్తగాను సత్తా చూపించాడు. ఎంతో మంది పేద పిల్లలను చదివించి ఆయన సేవ గుణాన్ని కూడా చాటుకున్నాడు మురళీమోహన్. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన.. లైఫ్ కు సంబంధించిన ఎన్నో విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నాడు. సినిమాలో స్టార్ సెలబ్రిటీలుగా, నటీనటులుగా రాణించేవారు.. తమ తోటి సెలబ్రిటీలను పెళ్లి చేసుకోవడం ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో అలాంటిదేమీ నిజంగా జరగకపోయినా.. వార్తలు వినిపిస్తూ ఉంటాయి.

मुरली मोहन से श्रीदेवी की शादी करवाना चाहती थीं मां, बेटी को लेकर पहुंच गई  थीं घर, पर नहीं बनी बात - sridevi mother wanted her to get married to  telugu actor

అలా.. గతంలో మురళీమోహన్‌కు జ‌య‌చిత్రాతో వివాహం జరిగిందని తమిళ్ మీడియాలో వార్తలు ముద్రించారు. అవన్నీ కేవలం పుకార్లేనని క్లారిటీ వచ్చేసింది. ఇక.. ఆపట్లో శ్రీదేవిని పెళ్లి చేసుకోవాలని.. పెళ్లి ప్రపోజల్ కూడా మురళీమోహన్ కు వెళ్లిందట. శ్రీదేవి హీరోయిన్ గా నటిస్తున్న ఓ సినిమా సెట్స్‌కు ఆమె తల్లి హాజరయిందట. అక్కడ మురళీమోహన్‌ను చూసిన ఆమె.. ఈ హీరో చాలా బాగున్నారు.. మా అమ్మాయి తో పెళ్లి చేస్తే బాగుంటుందని భావించిందట. ఇదే విషయాన్ని శ్రీదేవి తల్లి ఆయ‌న‌తో ముచ్చటంచిందట. అయితే ఆమె అప్పటికే మురళీమోహన్ కు పెళ్లి, పిల్లలు కూడా ఉన్నారని చెప్పినా అసలు నమ్మలేదట. ఇక చేసేదేమీ లేక‌ స్వయంగా మురళీమోహన్ గారి ఇంటికి శ్రీదేవి తల్లిని తీసుకువెళ్లి.. ఆయన భార్య, పిల్లలను చూపించారు. అప్పుడు శ్రీదేవికి ఇచ్చి ఆయన‌ను ఇచ్చి వివాహం చేయాలని ఆలోచన తాను మానుకుంద‌ట‌.