మహేష్‌తో సవాల దగ్గర డ్యాన్స్ చేయిస్తా.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..!

సూపర్ స్టార్ కృష్ణ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో తన స‌త్తా చాటుకున్నాడు. తనదైన స్టైల్ లో విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించాడు. సూపర్ హిట్లు, బ్లాక్ బ‌స్టర్లు, ఇండస్ట్రియల్ హిట్లు అని తేడా లేకుండా ఎన్నో సినిమాలను త‌న ఖాతాలో వేసుకున్న మ‌హేష్ రీజినల్ పిల్మ్‌స్‌తోను పాన్ ఇండియా సినిమాలకు సైతం పోటీ ఇచ్చి.. తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ఈ క్రమంలోనే ఆయనతో సినిమా చేసే అవకాశం వస్తే బాగుంటుందని.. ఎంతోమంది డైరెక్టర్స్ భావిస్తూ ఉంటారు.

Bandi Saroj Kumar: Movies, Photos, Videos, News, Biography & Birthday |  Times of India

కాక తనకు మాత్రం అవకాశం వస్తే మహేష్ తో రొటీన్ సినిమా కాకుండా.. ఏదో డిఫరెంట్ గా ప్రజెంట్ చేస్తానని.. చాన్స్ ఉంటే శ‌వాల‌ దగ్గర డ్యాన్స్ చేసే పాత్రలో చూపించాలనుకుంటున్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అంతేకాదు.. మహేష్ పొటాషియాలిటీ బయటకు తీసే సినిమాలేవి ప్రస్తుతం రావడం లేదంటూ చెప్పుకొచ్చాడు. మహేష్ దాదాపు అన్ని సినిమాల్లో ఒకే రకమైన రోల్ చేసి బోర్ కొట్టించార‌ని ఆరోపణలు చేశాడు. ఈ రేంజ్ లో మహేష్ గురించి బోల్డ్ కామెంట్స్‌ చేసిన ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. బండి సరోజ్ కుమార్. యూట్యూబ్లో నిర్బంధం, మాంగల్యం సినిమాలతో యూత్లో మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఆయన.. నటుడు గా, దర్శకుడుగా తానేంటో నిరూపించుకున్నాడు.

ఈ యంగ్ డైరెక్టర్.. ప్రస్తుతం తానే హీరోగా సినిమాలు చేసుకుంటూ రాణిస్తున్నాడు. ఇంటర్వ్యూలో తాజాగా బండి సరోజ్ కుమార్ మాట్లాడుతూ.. ఏ హీరోని ఎలా డైరెక్ట్ చేయాలని భావిస్తున్నారు అన్న ప్రశ్నకు.. మహేష్ గురించి ఇలా షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు. ఇప్పుడు బండి సర్రోజ్ కుమార్ కామెంట్స్ నెటింట‌ వైరల్ గా మారడంతో.. ఇవి హాట్‌ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్నాయి. ప్రస్తుతం మహేష్ దర్శకరుడు రాజమౌళి కాంబోలో టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియ‌స్ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో పృధ్వీరాజ్ సుకుమారన్.. బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఎస్ఎస్ఎంబి29 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా మహేష్ కెరీర్‌లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెర‌కెక్కుతుంది.