టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాల్లో హీరో, హీరోయిన్లకు తల్లి పాత్రలో నటించిన రూపా లక్ష్మికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన నీది నాది ఒకే కథ సినిమాల్లో తల్లి పాత్రలో నటించడమే కాదు.. కామెడీ పంచ్‌లతోను మెప్పించింది. దాదాపు 50 సినిమాల్లో అడపా దడపా రోల్స్ లో నటించి ఆకట్టుకున్న రూపా.. నాగశౌర్య నర్తనశాల, ఎక్స్ మినీ కదా, క్రాక్, సరిలేరు నీకెవ్వరు, మిడిల్ క్లాస్ అబ్బాయి లాంటి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. ఇటీవల కాలంలో బలగం సినిమాతో మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో తనకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది.
రూపా మాట్లాడుతూ ఆమె రియల్ లైఫ్ గురించి.. ఆమె స్వస్థలం గురించి చెప్పుకొచ్చింది. తన స్వస్థలం మదనపల్లి కాగా.. నెలల పసిపిల్లగా ఉన్న టైంలోనే ఆమెను తల్లిదండ్రులు దత్తత ఇచ్చేసారని.. పెంచుకున్న తండ్రి, సినిమాలు తప్ప నాకు మరో ప్రపంచం తెలియదని.. ఇక తండ్రి నన్ను చాలా బాగా చూసుకున్నారు.. ముగ్గురు పిల్లలు ఉన్న నన్ను తెచ్చుకొని మరీ పెంచుకున్నారు. చిన్నతనంలో స్కూల్ కి వెళ్ళనని తెగ మారం చేసేదాన్ని. దీంతో చదువుకోలేదు అంటూ రూపా లక్ష్మి చెప్పుకొచ్చింది. సినిమా వైపే ధ్యాస ఉండేదని.. సినిమాల్లోకి వెళ్తానంటే.. తండ్రి, మిగిలిన బంధువులు అంతా వద్దని నచ్చజెప్పి పెళ్లి చేసేసారు అంటూ చెప్పుకొచ్చింది.
ఇక పెళ్లయిన తర్వాత భర్త ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చాం. ఇక్కడ బంధువుల అబ్బాయి ప్రోత్సాహంతో మొదట షార్ట్ ఫిలిం లో నటించా. మొదట్లో చిన్న చిన్న పాత్రలు రాగా.. హరీష్ శంకర్ గారి సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ మూవీలో ఛాన్స్ వచ్చింది. ఈ సినిమా తర్వాత మరిన్ని అవకాశాలు క్యూ కట్టాయంటూ చెప్పుకొచ్చింది. ఇక తనకు ఇద్దరు కూతుళ్ళని పెద్దమ్మాయి డి ఫార్మా చదువుతుంది. చిన్నమ్మాయి బిబిఏ చదువుతోందంటూ వివరించింది. నేను చదువుకోకుండా చేసిన తప్పు నా పిల్లలతో చేయించకూడదని బాగా చదివిస్తున్నా అంటూ వివరించింది. మొదట్లో భర్తకు సినిమాల్లో నటించడం ఇష్టం లేదు. ప్రస్తుతం ఆయన నన్ను ఎంకరేజ్ చేస్తున్నారంటూ రూపా లక్ష్మీ వివరించింది.