టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. జక్కన్న ఈ సినిమాను పాన్ వరల్డ్ రేంజ్‌లో రూపొందించేలా ప్లాన్ చేస్తున్నాడు. దాదాపు రూ.1500 కోట్ల బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఎన్నో వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించిన న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. మహేష్ బాబు – జక్కన్న కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే సినిమా ఎప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ అభిమానులంతా కళ్ళు కాయలుకాచేలా ఎదురుచూస్తున్నారు. సినిమా అప్డేట్ కోసం తెగ రిక్వెస్ట్ లు పెడుతున్నారు. అయితే.. ఈ సినిమా ఇప్పట్లో రిలీజ్ కాదన్న సంగతి అందరికీ తెలిసిందే. సినిమా 2027 లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు మొదటి నుంచి వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే సినిమాపై ఎన్నో రిలీజ్ డేట్స్ వినిపించాయి. కాగా తాజాగా మరోసారి ఈ సినిమా రిలీజ్ డేట్ వైరల్‌గా మారుతుంది. అదేంటంటే.. సినిమా 2027 మార్చి 25న రిలీజ్ చేసేయాలని మేకర్స్ తెగ ప్రయత్నిస్తున్నారట. జనవరి, ఫిబ్రవరి కల్లా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించి.. మార్చి నెలలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని తెగ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
అయితే ప్రస్తుతం ఈ న్యూస్‌తో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కారణం 2022 మార్చ్ 25న రాజమౌళి డైరెక్షన్ లోనే ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో.. ఎన్ని అంచలనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియన్ సినిమాకు ఆస్కార్ అవార్డును సైతం తెచ్చిపెట్టింది. ఇప్పుడు రెండేళ్ల తర్వాత ఇదే డేట్‌కు రాజమౌళి.. మహేష్ మూవీ రిలీజ్ అవుతుంది అంటే ఈ సినిమా బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేయడం ఖాయమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మహేష్ ఇదే నెలలో వచ్చి కలెక్షన్ల వర్షం కురిపిస్తాడా.. లేదా.. అనేది వేచి చూడాలి. అయితే రాజమౌళి, మహేష్ మాత్రం ఈ సినిమా విషయంలో త్రిబుల్ ఆర్ సెంటిమెంట్ వర్కౌట్ చేయాలనే ప్లాన్ చేస్తున్నారట. ఇందులో వాస్తవం ఎంతో తెలియాలంటే అఫీషియల్ ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే.