పాన్ వరల్డ్ రేంజ్‌లో సినీ ప్రపంచమంతా గర్వించదగ్గ అవార్డు ఏదైనా ఉందంటే.. కచ్చితంగా దాన్ని ఆస్కార్ అనడంలో అతిశయోక్తి లేదు. ఈ అత్యున్నత పురస్కారాన్ని ఓ సినిమాల్లో ఏ చిన్న కేటగిరీకి వచ్చినా కూడా మొత్తం సినిమాకే గర్వకారణంగా నిలుస్తుంది. అలాంటి ఆస్కార్ మొట్టమొదటిసారి ఇండియన్ సినీ ఇండస్ట్రీలో త్రిబుల్ ఆర్ సినిమా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీ స్టారర్‌గా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలన రికార్డులను క్రియేట్ చేసింది. ఆస్కార్ అవార్డు దక్కింది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఏదో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పటికి వైరల్ అవుతూనే ఉంటుంది.
కాగా.. ఇప్పుడు తాజాగా ఆస్కార్ అవార్డు మరో కొత్త కేటగిరిని అనౌన్స్ చేసింది. ఇక ఆ కొత్త అవార్డును ప్రతి ఏడాది వార్షిక అవార్డుగా ఇవ్వనున్నారట. ఇంతకీ ఆ కేటగిరి పేరు చెప్పలేదు కదా స్టంట్ డిజైనింగ్ కేటగిరి. దీనిని ఆస్కార్ టీం అఫీషియల్‌గా ప్రకటించారు. హాలీవుడ్ సినిమాలైనా ఎవ్రీథింగ్ ఎవరీ వేర్ ఆల్ ఎట్ వన్స్, టామ్ క్రూజ్ మిషన్ ఇంపాజిబుల్ సినిమాలతో పాటు.. ఈ స్టాంట్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో త్రిబుల్ ఆర్ నుంచి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్టంట్ ని కూడా యాడ్ చేసి ఈ మూడు స్టిల్స్ తో ఈ కేటగిరీని అనౌన్స్ చేశారు. దీనితో రామ్ చరణ్ అభిమానులలో ఆసక్తి మొదలైంది.
అయితే… త్రిబుల్ ఆర్ సినిమాకు ఎలాంటి అవార్డు దక్కి అవకాశం లేదు. కానీ.. చరణ్ నుంచి నెక్స్ట్ రాబోయే సినిమాలో ఇదే రేంజ్ స్టంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆస్కార్‌లో చరణ్ నామినేట్ అయ్యే అవకాశం ఉంది. కారణం.. ఈ క్యాటగిరిలో అవార్డు 2027 నుంచి ప్రారంభించనున్నారట. ఈ విధంగా 2028లో 2027లో రిలీజ్ అయిన సినిమాలకు ఈ అవార్డు ఇవ్వబోతున్నట్లు ఆస్కార్ కన్ఫర్మ్ చేసింది. దీన్ని బట్టి ఇప్పటినుంచి వచ్చే సినిమాలకు స్టాంట్ సాలిడ్ గా ఉంటే.. ఆ స్టంట్ నామినేషన్‌లో మరో కొత్త క్యాటగిరీలోనూ ఎంపికై సినిమా ఖ్యాతిని పెంచవచ్చు.