హరికృష్ణ చేసిన పనికి కొడుకును చితక్కొట్టిన స్టార్ హీరో తండ్రి.. మ్యాటర్ ఏంటంటే..?

నందమూరి నటసార్వభౌమ ఎన్టీఆర్ వారసుల్లో ఒకరైన హరికృష్ణకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్టీఆర్ కు ఎల్లవేళలా సపోర్ట్ గా నిలుస్తూ.. రాజకీయాల్లోనూ ఆయన బ్యాక్‌బోన్‌గా ఉన్న హరికృష్ణ గారు.. ఎన్టీఆర్ చైతన్య రథాన్ని కూడా నడిపెవార‌ట‌. తెరవెనుక ఎన్టీఆర్ ను నడిపించింది కూడా హరికృష్ణనే అని.. రామారావును ఆయన కుమారులు ఎవరైనా ప్రశ్నించగలరు.. ఎదురు తిరిగి సమాధానం చెప్పగలరంటే.. అది కేవలం హరికృష్ణ మాత్రమేనని ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో బ‌య‌ట పడింది. అంతేకాదు ఓ ఇంటర్వ్యూలో బాల‌య్య స్వయంగా ఈ విషయాన్ని చెప్పుకోవచ్చాడు. అయితే.. హరికృష్ణ పెద్దయిన తర్వాత ఎంత హుందాతనంగా ఉన్నా చిన్నప్పుడు మాత్రం చాలా అల్లరి పనులు, చిలిపి చేష్టలు చేస్తూ ఉండేవాడట.

With Nandamuri Harikrishna's death, a chequered political career comes to an end - The Hindu

ఆయన తప్ప ఎన్టీఆర్ మిగతా పిల్లలందరూ ఎంతో సైలెంట్ గా ఉండే వారిని.. హరికృష్ణ మాత్రం గోలగోలగా ఉండే వారిని.. అందరిని ఆటపట్టించే వారిని సమాచారం. ఇలాంటి క్రమంలోనే హరికృష్ణ చేసిన అల్లరి పనికి స్టార్ హీరో దెబ్బతినాల్సి వచ్చిందట. హరికృష్ణ ను ఏమీ చేయలేక.. ఆ హీరో తండ్రి తనను చితక బాధేవాడట. ఇంతకీ ఆ హీరో ఎవరు..? అసలు హరికృష్ణ చేసిన దానికి ఆ హీరో ని ఎందుకు తండ్రి కొట్టేవాడు.. ఆ కథ ఏంటో ఒకసారి చూద్దాం. ఇంతకీ ఆ స్టార్ హీరో మరెవరో కాదు కామెడి సినిమాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుని వ‌రుస‌ సినిమాలతో ఒకప్పుడు స్టార్ హీరోగా రాణించిన రాజేంద్రప్రసాద్.

ఆయన కుటుంబం అంతా దాదాపు 24 ఏళ్ల పాటు ఎన్టీఆర్ ఇంట్లోనే అద్దెకి ఉండేవారట. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ కుటుంబంతో ఆయనకు మంచి అనుబంధం ఉంది. అంతేకాదు.. ఎన్టీఆర్ పిల్లల్లో ఒకరిగా ఆయన ఉండేవారట. అయితే. ఇలాంటి క్రమంలోనే హరికృష్ణ చేసే అల్లరి పనులకు తాను దెబ్బలు తినాల్సి వచ్చేదని రాజేంద్రప్రసాద్ స్వయంగా వెల్లడించారు. మా నాన్నగారు చాలా స్ట్రిక్ట్ అని.. ఇక హరికృష్ణ చేసిన అల్లరి పనులకు ఆయన కొట్టలేక.. ఎప్పుడు నన్ను చితక్కొట్టే వారిని రాజేంద్రప్రసాద్ చెప్పుకొచ్చాడు. మొదట్లో హీరోగా పలి సినిమాలో నటించిన ఆయన ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టులను వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా రిలీజ్ అయిన రాబిన్‌హుడ్ మూవీ ప్రమోషన్ లో రాజేంద్రప్రసాద్ ఈ విషయాన్ని షేర్ చేసుకున్నాడు.