ప్రస్తుతం పాన్ ఇండియన్ రెబల్ స్టార్ గా చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా దూసుకుపోతున్నాడు ప్రభాస్. ఆరడుగుల అందం, మాటతీరు, వ్యక్తిత్వం, నటన, డైలాగ్ డెలివరీ ఇలా ప్రతి విషయంలోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ప్రభాస్.. ఎంత మంది స్టార్ హీరోస్ ఉన్నా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక ప్రభాస్ మంచితనం గురించి అందరికి తెలిసిందే. కేవలం స్టార్ సెలబ్రిటీలనే కాదు.. తన ఇంటికి ఎవరు వచ్చిన కడుపునిండా భోజనం పెట్టి వారిని ఆనందంగా తిరిగి పంపిస్తాడు.
ఇక ఏదైనా సమస్యతో ఇంటికి వస్తే కచ్చితంగా దాన్ని తీర్చే విధంగా ప్రయత్నించే వారిలో.. మొదట ప్రభాసే ఉంటాడు. అలాంటి ప్రభాస్ కి ఏదైనా ప్రాబ్లం వచ్చిన.. మనసుకు కష్టమనిపించిన.. ఇబ్బంది అనిపించినా.. ఇలా ఎలాంటి సిచువేషన్ హేండిల్ చేయాలన్నా ఒకే ఒక్క మనిషి గుర్తుకు వస్తాడట. అతని దగ్గరకే ప్రభాస్ వెళ్తాడట. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు.. ఎందుకు అంత స్పెషల్ అనే విషయాన్ని స్వయంగా ప్రభాస్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. రెబల్ స్టార్ ప్రభాస్ క్యారెక్టర్ గురించి చాలామందికి తెలిసు.
ఆయన చాలా రిజర్వ్‌డ్ పర్సన్. అతి తక్కువ మందితో మాత్రమే క్లోజ్ గా మాట్లాడుతుంటారు. ఇక తనకు క్లోజ్ గా ఉండే వాళ్లతో మాత్రం ఎంతో చనువుగా.. మనసుతో మాట్లాడేస్తూ ఉంటారు. అలా ఇండస్ట్రీలోనే కాకుండా.. పర్సనల్ గాను ప్రభాస్ ఎక్కువగా నమ్మి ఫ్రెండ్‌షిప్ చేసే ఏకైక వ్యక్తి గోపీచంద్. హీరో గోపీచంద్ అంటే.. ఆయన ఎప్పుడు బ్రదర్‌లా ఫీల్ అవుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే తనకు ఏ కష్టం వచ్చినా.. ఏ బాధ అనిపించినా మొదట ప్రభాస్ నుంచి వెళ్లే కాల్.. గోపీచంద్‌కే అని ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ చెప్పుకొచ్చాడు. అంటే గోపీచంద్ కి ప్రభాస్ కు సంబంధించిన ప్రతి చిన్న విషయం అయినా వెంటనే తెలిసిపోతుందట.