టాలీవుడ్ కుర్ర హీరోలు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్సేన్ మధ్యన ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి నుంచి ఎంతో స్నేహంగా ఉండే ఈ ఇద్దరు స్టార్ హీరోల మధ్య గొడవ జరిగిందంటూ.. ఇద్దరికీ అసలు ఒకరంటే ఒకరు పడటం లేదని.. వార్ కొనసాగుతుందంటూ వార్తలు నెటింట వైరల్ అవుతున్నాయి. నిజానికి విశ్వక్‌సేన్, సిద్దు జొన్నలగడ్డ, ప్రొడ్యూసర్ నాగ వంశీ మొదటి నుంచి మంచి ఫ్రెండ్స్. ఈ క్రమంలోనే వీళ్లంతా కలిసి ఎన్నో సందర్భాల్లో ఫోటోలకు స్టిల్స్ కూడా ఇచ్చారు. ఇక ఎన్టీఆర్, బాలకృష్ణ లతో కూడా ఎంతో సన్నిహితంగా ఉండే ఈ ఇద్దరు కుర్ర హీరోల మధ్య.. తాజాగా గొడవలు జరిగాయట.
అసలు వీరికి మధ్య గొడవ ఏంటి.. ఎక్కడ ఈ గొడవ ప్రారంభమైంది.. అనే సందేహాలకు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో యాంకర్ సిద్దు జొన్నలగడ్డను ప్రశ్నించారు. ఇంటర్వ్యూవర్ మాట్లాడుతూ.. ఇదివరకు చాలా క్లోజ్ గా ఉండే మీరిద్దరికి ఈమధ్య ఒకరితో ఒకరు పడటం లేదని టాక్ ఉంది. ఆయన సినిమాపై మీ సినిమా.. మీ సినిమాపై ఆయన సినిమా వేసి ఒకరిపై ఒకరి కోపాన్ని చూపించుకుంటున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి అంటూ ఇంటర్వ్యూవర్ ప్రశ్నించగా.. ఎవరండీ అంటూ సిద్దు అడిగాడు. విశ్వక్‌సేన్ అంటూ యాంకర్ చెప్పుకొచ్చాడు.
యాంకర్ మాట్లాడుతూ.. అతని లైలా సినిమా రిలీజ్ అయితే.. మీరు కృష్ణ అండ్ హిస్ లీల సినిమాను రిలీజ్ చేశారు. ఇప్పుడు మీ జాక్ రిలీజ్ అవుతుంటే.. తను ఫలక్‌నామా దాస్ సినిమాను రిలీజ్ చేస్తున్నాడని.. మీ మధ్యన అసలు పడటం లేదని జనాలు అనుకుంటున్నారు.. దానిపై మీ రియాక్షన్ ఏంటి అని సిద్దూని యాంకర్ ప్రశ్నించారు. దానికి సిద్దు జొన్నలగడ్డ రియాక్ట్ అవుతూ.. మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఆరోజు అతను స్ట్రైట్ రిలీజ్ సినిమాకి.. నా రీ రిలీజ్ సినిమాకి, ఈరోజు నా స్ట్రైట్ రిలీజ్ సినిమాకి.. అతని రీ రిలీజ్ సినిమాకి ఎక్కడైనా కాంపిటీషన్ ఉందా.. నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ దగ్గర నుంచి.. బజ్ దగ్గర నుండి.. పబ్లిసిటీ దగ్గర వరకు ఇలా ఎన్నో వేరియేషన్స్ వస్తున్నాయి కదా.. అంటూ సిద్ధ జొన్నలగడ్డ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే వారి ఇద్దరి మధ్యన ఎలాంటి వార్ లేదని తెలిపారు.