టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్‌ఫుల్, పవర్ఫుల్ కాంబినేషన్ ఏదైనా ఉందంటే మొదట బాలయ్య, బోయపాటి కాంబినేషన్ గుర్తుకు వస్తుంది. ఇప్పటికే వీళ్లిద్దరు కాంబోలో సింహా, లెజెండ్, అఖండ లాంటి మూడు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లు వచ్చాయి. అంతేకాదు.. ఒకదానిని మించి ఒకటి సూపర్ హిట్గా నిలిచింది. ముఖ్యంగా అఖండ సినిమా అయితే బాలయ్య కెరీర్‌ని యూటర్న్ చేసింది అనడంలో అతిశయోక్తి లేదు. ఎన్నడూ చూడని మహర్దశ బాలయ్య సినీ కెరీర్‌కు అఖండ తర్వాతే మొదలైంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు భారీ బ్లాక్ బాస్టర్లు వచ్చాయి. ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబోలో తాజాగా తెరకెక్కుతున్న మూవీ అఖండ 2 తాండవం.
ప్రస్తుతం ఈ సినిమా షూట్ సరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. దసరా కానుకగా రిలీజ్‌కు ప్లాన్ చేసిన ఈ సినిమాకు సంబంధించిన షాకింగ్ అప్డేట్ ప్రస్తుతం నెటింట వైరల్‌గా మారుతుంది. అదేంటంటే.. బాలయ్య బోయపాటి మధ్య క్రియేటివ్ డిఫరెన్స్‌లు ఏర్పడ్డాయని.. ఇద్దరి మధ్య ఈగోలతో గొడవలు మొదలయ్యాయని.. రీసెంట్గా బాలయ్య.. బోయపాటి పై అలిగి స్పాట్ నుంచి వాకౌట్ అయ్యాడని సమాచారం వైరల్‌గా మారుతుంది. ఈ వార్తల్లో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. ఫ్యాన్స్‌లో ఆందోళన మొదలైంది. ఫ్యాన్స్ అంతా ఎంతో ప్రతిష్టాత్మకంగా చూస్తున్న ఈ సినిమా ఆగిపోతుంది ఏమో అన్న సందేహం ఫ్యాన్స్‌లో ఆందోళన రేకెత్తిస్తుంది.
ఈ సినిమాతో బాలయ్య తన కెరీర్‌లోనే హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొడతాడని.. ఏకంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్‌వసుళ్లు వస్తాయని.. అభిమానులంతా గట్టిగా నమ్ముతున్నారు. ఇలాంటి క్రమంలో సినిమాపై వచ్చిన వార్తలన్నీ అవాస్తవాలన్నీ.. ఎలాంటి ఆందోళన పడనవసరం లేదని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. షూటింగ్ సరవేగంగా జరుగుతుందని.. బాలయ్య, బోయపాటి సినిమా కోసం.. ప్రాణం పెట్టి పనిచేస్తున్నారని సమాచారం. ఇప్పటికే థమన్ మ్యూజిక్ ని కూడా రెడీ చేశారట. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గూస్‌బంప్స్ తెప్పించేలా ఉందని.. ట్యూన్స్ అన్ని అదరగొట్టాడని తెలుస్తుంది. ఇక అఖండ సినిమా అంత పెద్ద బ్లాక్ బస్టర్ కావడానికి బాలయ్య, బోయపాటి కష్టం ఎంతయితే ఉందో.. అదే రేంజ్ లో మ్యూజిక్ విషయంలో థమన్ శ్రమ కూడా ఉంది అనడంలో సందేహం లేదు.