టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి.. ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలతో తన సత్తా చాటుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్దన్నగా కొనసాగుతున్న చిరు.. ఎంతోమందికి ఇన్స్పిరేషన్‌గా నిలుస్తున్నాడు. ఇక.. ఏడుపదుల వయసులోనూ తన సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందుకోవాలని కసితో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం వశిష్ట డైరెక్షన్‌లో విశ్వంభర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతోపాటే.. అనిల్ రావిపూడి డైరెక్షన్లో మరో సినిమాలో నటించనున్నాడు చిరు. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని ముగించారు.
ఇక సినిమాలో వింటేజ్ చిరంజీవిని చూడబోతున్నారని.. చిరంజీవిలోని కామెడీ, మాస్ యాంగిల్స్ ను సరికొత్తగా మరోసారి ఆడియన్స్‌కు పరిచయం చేయాలని అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక చిరు అనుకున్నట్లుగానే సినిమాతో అనిల్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చి ఆయన ఇమేజ్‌ను మరింతగా పెంచుకుంటారా.. లేదా సినిమాతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో వేచి చూడాలి. అయితే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి వైరల్ గా మారుతుంది. సినిమా ఇంటర్వెల్ సీన్ చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశాడట అనిల్ రావిపూడి.
ఈ ట్విస్ట్ ఒక్కొక్కరికి మైండ్ బ్లాక్ అవుతుందని.. చిరంజీవి ఎవరు అనేది ఇంటర్వెల్ వరకు రిలీజ్ చేయకుండా రహస్యంగా ఉంచి ఇంటర్వెల్ ముందు ఆయన ఎలివేట్ చేస్తారని.. అతని ఫ్లాష్ బ్యాక్ ను ఓపెన్ చేస్తారని సమాచారం. ఇప్పటివరకు ఇలాంటి స్టోరీ తో ఎన్నో సినిమాలు తెరకెక్కినా.. అనిల్ రావిపూడి తనదైన మార్క్ డైరెక్షన్.. కామెడీతో సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారట. చిరంజీవి ఒక డాన్ గా కనిపించనున్నాడని.. ఇక ఆయన తర్వాత వేరే దగ్గరకు వెళ్లి ఎందుకు తలదాచుకోవాల్సి వచ్చింది అనేది స్టోరీ అని తెలుస్తుంది. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ ప్రేక్షకుల్లో హై ఫీల్ కలిగేలా అనిల్ రావిపూడి డిజైన్ చేసినట్లు తెలుస్తుంది.