టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి.. ప్రస్తుతం నేషనల్ లెవెల్‌లోనే కాదు.. ఇంటర్నేషనల్ లెవెల్లో ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతుంది. రాఘవేంద్రరావు శిష్యుడుగా స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయమైన ఆయన.. బాహుబలి, ఆర్‌ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్లతో సంచలనాలు సృష్టించాడు. అయితే కేవలం దర్శకుడుగానే కాదు.. రాజమౌళి కొన్ని సినిమాల్లో అతిథి పాత్రలోను నటించి ఆకట్టుకున్నాడు. ఇంతకీ ఆ సినిమాల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం.
సై
2004లో నితిన్ – జనీలియా హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సై సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనికి రాజమౌళి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో నల్లబాలు (వేణుమాధవ్) అనుచరుడిగా రాజమౌళి గెస్ట్అపీరియన్స్ ఇచ్చారు.
రెయిన్బో
2008లో ఎంబీఏ ఆదిత్య డైరెక్షన్‌లో రాహుల్ – సోనాల్ చౌహన్ హీరో, హీరోయిన్లుగా మెరిసిన రెయిన్బో సినిమాలోని రాజమౌళి గెస్ట్ పాత్రలో కనిపించాడు.
మగధీర
మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా కాజల్ హీరోయిన్గా నటించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న మగధీర 2009 లో రిలీజ్ అయ్యా ఇలాంటి సక్సెస్ అందుకుందో తెలిసిందే. ఇక ఈ సినిమాలోని రాజమౌళి అనగనగనగా సాంగ్స్ చివరిలో తళుక్కున మెరిసి ఆకట్టుకున్నాడు.
బాహుబలి
ఇక ఆయన కెరీర్‌లోనే మొట్టమొదటి పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ బాహుబలి సినిమాలోని రాజమౌళి స్పెషల్ సాంగ్ ముందు.. వైన్ అమ్ముకునే వ్యక్తిగా కనిపించాడు.
మజ్ను
ఇక 2019లో న్యాచురల్ స్టార్ నాని, అనుఇమ్మన్యూయేల్.. హీరో, హీరోయిన్లుగా నటించిన మజ్ను సినిమాలోని రాజమౌళి గెస్ట్ రోల్‌లో మెరిసారు.
ఆర్ఆర్ఆర్
ఇక ఆయన చివరిగా తెరకెక్కించి బ్లాక్ బస్టర్ సక్సస్‌లు అందుకున్న త్రిబుల్ ఆర్ సినిమాల్లో నెత్తురు మరిగితే ఎత్తర జెండా సాంగ్ లోను నటించాడు.