అలనాటి స్టార్ హీరోయిన్ సౌందర్యకు టాలీవుడ్‌లో ఎలాంటి ఇమేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన కెరీర్‌లో చాలామంది స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. తన నటన, అమాయకత్వం, ట్రెడిషనల్ లుక్‌తో కుర్ర కారును కట్టిపడేసింది. ఈ క్రమంలోనే సీనియర్ హీరోలు అందరితోనూ మంచి ర్యాపో ఏర్పడిన సౌందర్యకు.. ఎవరితో నటించినా సరే పర్ఫెక్ట్ పెయిర్ అనిపించుకునేది. మొత్తానికి స్టార్ హీరోయిన్గా ఎన్నో సంవత్సరాలు ఇండస్ట్రీని ఏలేసిన ఆమె.. కెరీర్ మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో ప్రమాదంలో హఠాత్ మరణం పాలైన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ వార్త ఇండస్ట్రీని కుదిపేసింది. కాగా తాజాగా సౌందర్యకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి.
గతంలో సౌందర్య హీరోయిన్గా పిక్స్ లెవల్లో దూసుకుపోతున్న సమయంలో.. అప్పుడే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి సక్సెస్‌లు అందుకుంటున్న మహేష్ బాబు పక్కన హీరోయిన్గా నటించే అవకాశం వచ్చిందట. ఆ మూవీ మరేదో కాదు వైవీఎస్ చౌదరి డైరెక్షన్లో మహేష్ హీరోగా తెరకెక్కి బ్లాక్ బస్టర్ అందుకున్న యువరాజు. ఈ సినిమాలో సిమ్రాన్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. అయితే మొదట సిమ్రాన్ పాత్ర కోసం సౌందర్యను అనుకున్నారట. కానీ.. మహేష్ తో తాను చేస్తే పక్కన హీరోయిన్ లా కాదు అక్కలా ఉంటానని.. భార్యల అసలు కనిపించనని.. మా ఇద్దరికీ సెట్ కాదని చెప్పడంతో డైరెక్టర్ చేసేదేమీ లేక సౌందర్యం తప్పించి సిమ్రాన్‌ను ఈ పాత్ర కోసం తీసుకున్నట్లు సమాచారం.
ఏదైనా సౌందర్య తను తీసుకున్న నిర్ణయాల్లో ఫుల్ క్లారిటీ చూపించేదనడానికి ఇదే బిగెస్ట్ ఉదాహరణ. నిజానికి మహేష్ బాబు కూడా అప్పట్లో చాలా చిన్నపిల్లాడు. ఇక సౌందర్య సీనియర్ సార్ హీరోలందరూ సరసన నటించి మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఈ క్రమంలోనే ఆమె ఏజ్ కూడా ఎక్కువ ఉంటుందని.. ప్రతి ఒక్క అభిమాని ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటి క్రమంలో మహేష్ బాబు లాంటి యంగ్ హీరో లవర్ పాత్రలో తాను నటించడం అంటే సాహసమే. అందుకే.. ఆమె తనకు ఉన్న పేరుని చెడగొట్టుకోవడం ఇష్టం లేక ఈ సినిమాలో నటించనని చెప్పేసింది. ఇక ఇప్పటికే మహేష్ బాబు కూడా చాలా సందర్భాల్లో సౌందర్యతో నటించాలని ఎన్నోసార్లు అనుకున్నారట. కానీ.. అలాంటి అవకాశం వచ్చిన కార్యరూపం దాల్చకపోవడంతో కొంతవరకు మహేష్ ఫీలైనట్లు ఓ సందర్భంలోనూ వెల్లడించాడు.