ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న చాలామంది నటులు.. సినిమా కోసం ఏదైనా స్టాంట్ చేయాలంటే.. చాలా ఆలోచన చేస్తారు. అయితే సినిమాల కోసం ఎంత పెద్ద రిస్క్ అయినా.. ఎలాంటి రోల్ లో అయినా.. నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి తమ సత్తా చాటుతున్న హీరోలు సైతం అన్నారు. అలాంటి వారిలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అంటే.. ఆ పాత్ర కోసం తాను ఏం చేయడానికైనా సిద్ధమవుతాడు. పాత్రలో ఒదిగిపోయి నటిస్తాడు. ఎంత పెద్ద రిస్క్ అయినా గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. డైరెక్టర్ ఏది చెప్తే దానికి సై అంటాడు. ఇప్పటికే ఈ విషయం ఎన్నో సార్లు తనతో పనిచేసిన దర్శకులు వివరించారు.
ఎన్టీఆర్ నటన పై ఉన్న డెడికేషన్ అది అంటూ ఇప్పటికే ఎన్నోసార్లు టాక్ నడిచింది. అయితే.. తాజాగా మరోసారి ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ సినిమా కోసం చేస్తున్న పని అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇంతకీ ఎన్టీఆర్ చేసిన ఆ రిస్క్ ఏంటో.. అసలు మేటర్ ఏంటో.. ఒకసారి తెలుసుకుందాం. ప్రశాంత్ నీల్, తారక్ కాంబోలో ఎన్టీఆర్ 31 రన్నింగ్ టైటిల్ తో సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూట్ ప్రారంభమైనా.. ఎన్టీఆర్ మాత్రం ఇంకా సెట్స్‌లో అడుగు పెట్టలేదు. కాగా.. సినిమా అనౌన్స్మెంట్ అప్పటినుంచి.. ఆడియన్స్‌లో సినిమాపై ఫిక్స్ లెవెల్ అంచనాలు నెలకొన్నయి. ఈ క్రమంలోనే నందమూరి ఫ్యాన్స్ అంతా ఈ సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెగ మురిసిపోతున్నారు.
అయితే ఇలాంటి క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్‌కు సంబంధించిన ఓ న్యూస్ నెటింట వైరల్ గా మారుతుంది. ఈ సినిమా తారక్ కెరీర్‌లోనే ఎంతో స్పెషల్‌గా ఉండబోతుందని మేకర్స్ వెల్లడించారు. అంతేకాదు.. ప్రశాంత్ ఈ సినిమాలో తారక్‌ను చాలా న్యాచురల్ గా చూపించనున్నాడట. క్యారెక్టర్ కి అనుగుణంగా ఆయన ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో గుండు కొట్టుకొని కనిపించనున్నారు అని.. వేరే ఏదైనా డూప్లికేట్ ప్రోడక్ట్ పెడితే ఆయనలో న్యాచురాలిటీ మిస్ అవుతుందన్న ఉద్దేశంతోనే తారక్ తో దీనిపై కూడా చర్చించాడని.. ఇక తారక్ మ్యాటర్ చెప్పిన వెంటనే గుండు కొట్టుకుంటే క్యారెక్టర్ కు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందా.. అయితే ఓకే గుండు కొట్టించేసుకుందాం ఏముంది అంటూ ఓపెన్గా ప్రశాంత్ నీల్‌కు ఎస్ చెప్పేసాడని టాక్ నడుస్తుంది.