ఏపీ డిప్యూటీ సీఎం.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్ ఇటీవల సింగపూర్లో తాను చదువుతున్న స్కూల్లో అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. సమ్మర్ క్యాంప్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ కాళ్లు, చేతులకు గాయాలు అవడంతో పాటు.. ఊపరితిత్తులు శ్వాస ఇబ్బందులతో స్పెషల్ ట్రీట్మెంట్‌ను తీసుకున్నాడు. కొంతకాలం ఐసీయూలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రమాదం విషయం తెలిసిన పవన్ వెంటనే అక్కడకు చేరుకున్నారు. పవన్‌తో పాటు.. మెగాస్టార్ చిరంజీవి, సురేఖలు కూడా సింగపూర్‌కు వెళ్లి మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు.
వైద్యులతోనూ మాట్లాడిన తర్వాత తాజాగా.. మెగాస్టార్ మార్క్ మెల్లమెల్లగా కోరుకుంటున్నాడని ఇప్పుడు ఇంటికి వచ్చేసాడని.. హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశాడు. ఇలాంటి క్రమంలోనే మార్క్ ట్రీట్మెంట్‌కు అయినా ఖర్చు వైరల్ గా మారుతుంది. కాళ్లు, చేతులు గాయాలతో పాటు.. ఆయన ఊపిరితిత్తుల్లో పొగ చేరిపోవడంతో అత్యవసర విభాగంలో చర్చి స్పెషల్ ట్రీట్మెంట్ను అందించారు. ఇక ఇటీవల అత్యవసర వార్డ్ నుంచి గదిలోకి తీసుకువెళ్లి.. మరో మూడు రోజులు పాటు వైద్య పర్యవేక్షణలో ఉంచిన వైద్యులు తాజాగా డిశ్చార్జ్ చేశారు. అయితే.. బ్రోన్కోస్కోపి ట్రీట్మెంట్ తో మార్క్స్ శంకర్ కి నయమైంది. ఇక ఈ ట్రీట్మెంట్ కోసం ఎన్నో లక్షలు ఖర్చు చేసి ఉంటారని అంతా అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
లంగ్స్లో చేరిన విషవాయువును తొలగించి.. స్వచ్ఛమైన ఆక్సిజన్ ని వదలడానికి ఈ ట్రీట్మెంట్ చేస్తారు. అయితే పరిస్థితి తీవ్రతను బట్టి బ్రోన్కోస్కోపీ ట్రీట్మెంట్ డాక్టర్స్ నిర్ణయిస్తారు. దీనిని ప్రమాదం జరిగిన 30 నిమిషాలలోపే చేయాల్సి ఉంటుంది. లేదంటే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని.. నిపుణులు చెబుతుంటారు. ఇలాంటి క్రమంలోనే ట్రీట్మెంట్ కు లక్షల్లో ఖర్చు అవుతుందని టాక్ నెటింట తెగ వైరల్ గా మారుతుంది. అయితే పవన్ తనయుడికి ఈ ట్రీట్మెంట్ లో మాత్రం చాలా తక్కువ ఖర్చు అయిందని.. కేవలం రూ.30 వేల లోపే ఈ ట్రీట్మెంట్ పూర్తయిందని టాక్. ప్రస్తుతం మార్క్ లేచి నడుస్తున్నాడని చక్కగా మాట్లాడుతున్నాడని.. మార్క్ శంకర్ పూర్తిగా కోల్పోవడానికి మరి కొంత సమయం పడుతుందని.. తర్వాత అతని హైదరాబాద్కు తీసుకురానున్నట్లు సమాచారం. దీనికి మరో రెండు రోజులు టైం పడుతుందట. ఈ క్రమంలోనే చిరంజీవి ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయం ఇండియాకు చేరుకుంటారని.. పవన్ మాత్రం సోమవారం వరకు వచ్చే ఛాన్స్ లేదని సమాచారం.