మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా మూవీ విశ్వంభర. అభిమానులంతా ఈ సినిమా కోసం ఎప్పటినుంచో కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. మొదట ఈ ఏడాది సంక్రాంతి కానుకగా సినిమా రిలీజ్ అవుతుందని భావించారు. భారీ ట్రోల్స్ జరుగుతున్న క్రమంలో.. మేకర్స్ దీనిపై మరింత జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే. కొత్త రిలీజ్ డేట్‌ను ఇప్పటివరకు అఫీషియల్ గా ప్రకటించింది లేదు. జులై నెలలో రిలీజ్ చేస్తారని వార్త మాత్రం వైరల్ అవుతుంది.
అది కూడా.. ఇంకా ఫిక్స్ కాలేదు. ఇలాంటి క్రమంలో తాజాగా సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కాగా.. ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. కాగా తాజాగా సంబంధించిన ఓ ఆసక్తికర న్యూస్ వైరల్ గా మారుతుంది. అదేంటంటే.. సినిమాల్లో ఓ వైవిధ్యమైన ఫైట్ ను ప్లాన్ చేశారట టీం. ఇక ఈ ఫైట్ లో ఏకంగా 6 రాక్షసులతో చిరంజీవి పోరాడనున్నాడని.. ఫైట్ మొత్తం సినిమాకి హైలైట్ గా నిలవనుందని.. ఇక చిన్న పిల్లలకైతే ఈ ఫైట్ సీన్ చాలా స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుందని.. టాక్.
సినిమా చూస్తున్నంత సేపు కొత్త యూనివర్స్‌లో అడుగుపెట్టిన ఫీల్ వస్తుందని.. బలమైన కంటెంట్ ఉన్న ఇలాంటి సినిమా రిలీజై.. చాలా కాలం అవుతుందని టాక్ నడుస్తుంది. అయితే ప్రస్తుతానికి సినిమాపై పెద్దగా అంచనాలు లేకున్నా.. భవిష్యత్తులో ప్రమోషనల్ కంటెంట్ తో సినిమాపై మంచి హైప్‌ను క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ప్రస్తుతం మెగాస్టార్ విశ్వంభరపై ఫ్యాన్స్ ఆశలన్నీ పెట్టుకున్నారు. మరి ఈ సినిమా విషయంలో టీం.. ఇకనైనా సరైన జాగ్రత్తలు తీసుకుని ప్రమోషన్స్ తో ఆకట్టుకుంటారా.. లేదా.. ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో వేచి చూడాలి.