పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతంలోనే మూడు సినిమాలకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పటికే సినిమాలో రిలీజ్ కావలసి ఉండగా.. ఇప్పటివరకు ఒక్క సినిమాను కూడా రిలీజ్ చేయలేదు. పవన్ ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో కమిట్ అయిన సినిమాలకు కూడా డేట్స్ కేటాయించలేక సతమతమౌతున్నాడు. ఈ క్రమంలోనే దర్శకనిర్మాతలు పవన్ పరిస్థితిని అర్థం చేసుకుని.. ఆయనకు సమయం కుదిరినప్పుడే షూట్ ను ముగించుకుంటున్నారు. అయినా.. ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. ఇక ఈ మూడు సినిమాలు పూర్తయిన తర్వాత.. పవన్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా.. లేదా.. అనే దానిపై కూడా క్లారిటీ లేదు.
ఓ పక్క ఏపీ రాజకీయాల్లో డిప్యూటీ సీఎం బాధ్యతలతో బిజీ బిజీగా గడుపుతున్న పవన్.. సరే అంటే చాలు సినిమాలు చేయడానికి ఎంతో మంది దర్శకనిర్మాతలు సిద్ధంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న బొమ్మరిల్లు భాస్కర్.. గతంలో పవన్ కళ్యాణ్‌కు వినిపించానని చెప్పుకొచ్చాడు. రీసెంట్గా సిద్దు జొన్నలగడ్డ హీరోగా.. వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించిన జాక్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆడియన్స్‌లో మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో బొమ్మరిల్లు భాస్కర్ మాట్లాడుతూ.. కెరీర్ బెస్ట్ మూవీ ఇప్పటివరకు తీయలేదని.. కాగా ఆరంజ్ మూవీ టైంలో పవన్ కళ్యాణ్ కి ఓ స్టోరీ చెప్పానని.. ఆ మూవీ తీస్తే బెస్ట్ సినిమా అవుతుంది అనుకున్నా.
పవన్‌కు స్టోరీ వినిపించగానే కథని ఇలా కూడా రాస్తారా.. చాలా డిఫరెంట్ గా ఉంది కానీ బాగుంది అన్నారని భాస్కర్ వివరించాడు. అయితే పవన్‌కు స్టోరీ అంతగా నచ్చినా.. దాన్ని నేనే పక్కన పెట్టేసానని.. కథ ఫినిష్ చేయాలంటే మరికాస్త లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయాల్సి ఉంటుందని నాకు అనిపించింది. అందుకే.. ఆ స్టోరీని పక్కన పెట్టేసా ఇప్పుడు ఆ స్టోరీ కి కావలసిన ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. అందుకే స్టోరీని సిద్ధం చేశా అంటూ బొమ్మరిల్లు భాస్కర్ వివరించాడు. మరి భాస్కర్ ఈ కథను పవన్‌తోనే చెస్తాడా.. లేదా మరో స్టార్ హీరోతో సినిమాను చేసి రిలీజ్ చేస్తాడా.. అనేది వేచి చూడాలి. అయితే.. అప్పుడెప్పుడో గతంలో పవన్ కు నచ్చిన స్టోరీ ఈ జనరేషన్‌లో తీస్తే.. అది ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతుందా.. లేదా.. అనేది కూడా ఆలోచించాలి. ఆరెంజ్ సినిమా రిలీజ్ ఇప్పటికే 15 ఏళ్లు పూర్తవుతుంది. కనుక బొమ్మరిల్లు భాస్కర్ కథను ఇప్పటి ట్రెండుకు తగ్గట్టు మార్చి రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.