సినీ ఇండస్ట్రీలో ప్రతి ఏడాది ఎంతో మంది నట్లుగా సక్సెస్ సాధించి స్టార్ సెలబ్రెటీల్ గా రాణించాలని అడుగుపెడుతూ ఉంటారు. వారిలో ఎంతోమంది హీరోయిన్స్‌గా తమ సత్తా చాటుకోవాలని తెగ ప్రయత్నిస్తూ ఉంటారు. దానికి తగ్గట్టు శ్రమిస్తారు. అయితే ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన వారికి అదృష్టం అనేది చాలా ముఖ్యం. ఎంత గొప్ప టాలెంట్ ఉన్నా సరే కొన్నిసార్లు అదృష్టం కలిసి రాక ఫేడౌట్ అయ్యిన ముద్దుగుమ్మలు ఉన్నారు. ఇక చిన్న వయసులోనే హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చి స్టార్ బ్యూటీలు గా మారిన వారు ఉన్నారు.. అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న హీరోయిన్ కూడా ఒకటి.
తాను.. కేవలం 14 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడమే కాదు.. వరుస సినిమాలో సక్సెస్‌లు అందుకొని స్టార్ హీరోయిన్‌గాను మారింది. 14 ఏళ్లకే హీరోయిన్గా మారిన ఈ ముద్దుగుమ్మ.. తనకంటే 15 ఏళ్ల పెద్దవాడిని పెళ్లి చేసుకోవడం అప్పట్లో నెటింట హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు..? ఆమె డీటెయిల్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఈ ముద్దుగుమ్మ పేరు ఇక్రా అజీజ్. ఈమె టాలీవుడ్ ఆడియన్స్ కు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. ఈమె ఓ పాకిస్తాన్ నటి. టీవీ షో లతో కెరీర్ ను ప్రారంభించిన ఈ అమ్మడు.. తర్వాత నటిగామారి.. మంచి మంచి అవకాశాలను దక్కించుకుంది.
ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్‌గా ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన ఈమెకు.. తల్లే ఇంటి భారాన్ని మోసిందని.. ఈ క్రమంలోనే తాను కూడా ఎన్నో కష్టాలను అనుభవించానని పలు సందర్భాల్లో వెల్లడించింది. ఇక తల్లి కష్టాలను చూస్తూ ఎదిగిన ఇక్ర ఉన్నత చదువులు చదువుకోలేకపోయింది. 14 ఏళ్లకే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. కిస్నే ఆప్నా కహే టీవీ షో తో కెరీర్ ప్రారంభించుకుని.. ఈ క్రమంలోనే ప్రముఖ పాకిస్తానీ నటుడు, రైటర్ యాసిన్ హుస్సేన్ ను ప్రేమించి వివాహం చేసుకుంది. ప్రస్తుతం పాక్ లోనే అత్యంత సంపన్న నటిగా ఇమేజ్‌క్రియేట్ చేసుకుంది. కేవలం యాక్టింగ్‌తోనే దాదాపు రూ.700 కోట్లకు పైగా సంపాదించింది.