విజయశాంతి మాట‌ల‌కు తారక్ ఫైర్.. స్టేజ్ పై నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం..!

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఎదిగిన ప్రతి ఒక్కరికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అయితే అభిమానులకు కేరింతలు, అల్లర్లు హీరోలకు ఆనందాన్ని కల్పించినా.. కొన్నిసార్లు వారు చూపించే అత్యుత్సాహం హీరోలకు కొత్త ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. అంతేకాదు ఫ్యాన్స్ చేసిన పనికి హీరోలు క్షమాపణలు చెప్పాల్సిన సందర్భాలు కూడా వస్తూ ఉంటాయి. తాజాగా.. ఇలాంటి పరిస్థితి యంగ్ టైగర్ ఎన్టీఆర్ఎదుర్కోవాల్సి వచ్చింది.

NTR Goose Bumps Entry at Arjun Son Of Vyjayanthi Pre Release Event - NTV Telugu

తాజాగా.. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ లెవెల్లో ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్లో తారక్ చీఫ్ గెస్ట్ గా హాజరై సందడి చేశాడు. ఈ క్రమంలోనే తారక్‌ని ఉద్దేశించి విజయశాంతి మాట్లాడుతున్నంత సేపు.. ఫ్యాన్స్ సీఎంసీఎం అని అరుపులు, కేరింతలతో.. గ్రౌండ్ హోరేత్తించారు.

ఈ క్రమంలోనే సహనాన్ని కోల్పోయిన ఎన్టీఆర్.. మీరు అరవడం ఆపేస్తారా.. లేదా నేను స్టేజ్ పైనుంచి వెళ్ళిపోవాలా అంటూ ఫైర్ అయ్యాడు. వెంటనే విషయం అర్థం చేసుకున్న విజయశాంతి.. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరిని పక్కపక్కన నిల్చోబెట్టి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ను కూల్ చేసింది. ఈ సినిమాలో విజయశాంతి.. కళ్యాణ్ రామ్ తల్లి పాత్రలో నటించగా.. సాయి మంజ్రేకర్ హీరోయిన్గా మెరిసింది. ప్రదీప్ చిలకలూరి డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా ఈ నెల 18న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది.