సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న వారికి ఉండే క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమందిని హీరోలను అభిమానులు ఆరాధ్య దైవాలుగా కొలిచేస్తూ ఉంటారు. వారి కోసం ఇతరులను కొట్టడానికి, వాళ్లతో కొట్టించుకోవడానికి కూడా వెనకడుగు వేయరు. సినిమాల్లో ప్రచారాల కోసం, ఆ హీరోల కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధమయేంతలా డై హార్ట్ ఫ్యాన్స్ కూడా ఉంటారు. అంతటి పాన్ ఫాలోయింగ్ ఆడియన్స్‌లో వచ్చిందంటే ఖచ్చితంగా స్టార్ సెలబ్రిటీలకు పేరు, ప్రఖ్యాతలతో పాటు.. డబ్బు, సంపాదన కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఈ క్రమంలోనే సినిమాల సక్సెస్ లకు కొంతమంది స్టార్ హీరోస్ సెంటిమెంట్స్ కూడా వర్కౌట్ చేస్తూ ఉంటారు.
జ్యోతిష్యం, వాస్తు, ముహూర్తం లాంటి వాటిని విపరీతంగా నమ్మే హీరోలు మన టాలీవుడ్ లో ఎంతమంది ఉన్నారు. వారిలో కొంతమంది న్యూమరాలజీని బాగా విశ్వసిస్తూ ఉంటారు. ఆ విశ్వాసంతోనే తమ కొనుగోలు చేసిన కార్లకు లక్కీ నెంబర్ కోసం లక్షల్లో ఖర్చు పెడుతూ ఉంటారు. ఇటీవల సీనియర్ స్టార్ నటుడు నందమూరి బాలయ్య తన కొత్త కార్ కోసం అత్యంత డిమాండ్ ఉన్న 0001 రిజిస్ట్రేషన్ నెంబర్కు ఏకంగా రూ.7.75 లక్షలు ఖర్చు పెట్టారన్న న్యూస్ అందరికీ తెలిసిందే. అలాగే గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ సైతం ఫ్యాన్సీ నెంబర్ దక్కించుకునే ప్రయత్నంలో లంబోర్గిని ఉరోస్ వాహనంకు టీఎస్ 09 ఎస్ఎస్ 9999 నెంబర్ను దక్కించుకోవడం కోసం ఇప్పటికే ఏకంగా రూ.17 లక్షల ఖర్చు పెట్టాడట. ఎన్టీఆర్ దాదాపు తన అన్ని కార్లకు ఇదే నెంబర్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు.
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు తన కార్‌లు రేంజ్ రోవర్ , మెర్సిడెస్, జిఎల్ఎస్ కోసం.. vy ts09ek600 కొనుగోలు చేశాడు. నాగార్జున బిఎండబ్ల్యూ 7 సిరీస్ కోసం.. ఏపీ 09 బిడబ్ల్యు వేలంలో లక్షల ఖర్చు చేసి మరి దక్కించుకున్నాడు. ఇక అల్లు అర్జున్ కూడా తన రేంజ్ రోవర్ వోల్వా ఎక్స్ సి 90 కోసం.. ts07G9999 నెంబర్లపై ఏకంగా రూ.10 లక్షలు ఖర్చు పెట్టాడు. ఇక మాస్ మహారాజు రవితేజ తన ఎలక్ట్రికల్ వాహనం బివైడి ఆటో త్రీ నెంబర్.. టీఎస్ 09 కోసం.. 18000 ఖర్చు చేశాడు. ఇక మన టాలీవుడ్ హీరోలోనే కాదు బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ తన లక్కీ నెంబర్ 11ను సెంటిమెంట్ గా ఫీల్ అవుతాడట.
తన వాహనాలకు 11 నెంబర్ వచ్చేలా చూసుకుంటాడట. అంతేకదా అమితాబ్ బర్త్డే కూడా 11 కావడం విశేషం. కోలివుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇష్టమైన నెంబర్ 2222, ధనుష్ 106 నెంబర్లను ఇష్టపడతారు. సల్మాన్ ఖాన్ 2727 నెంబర్ ఎంచుకుంటాడు. షారుక్ ఖాన్ 555, సంజయ్ దత్ 4545 అలా ఈ స్టార్ హీరోస్ తమ వాహనాలకు కూడా తరచూ ఇదే నెంబర్స్ వచ్చేలా సెంటిమెంట్ చూస్తారు. అయితే ఎంతమంది హీరోలు పిచ్చిగా భావించి ఆ న్యూమరికల్ ఆస్ట్రాలజీని హీరోయిన్ మాత్రం పెద్దగా లెక్క చేయకపోవడం విశేషం. హీరోలకు