ఆ హీరోయిన్ నా ఆరాధ్య దైవం.. ఎంతలా ఆమెను ఇష్టపడ్డానంటే.. నాని

టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని న‌టుడిగానే కాకుండా.. ప్రొడ్యూసర్ గాను తన సత్తా చాటుకుంటూ వరుస సక్సెస్‌లు అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నాని హీరోగా.. ప్రొడ్యూసర్ గాను వ్యవహరించిన తాజా మూవీ హిట్ 3. మే 1న గ్రాండ్ లెవెల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా గడుపుతున్న నాని.. పలు ఇంటర్వ్యూలో సందడి చేస్తున్నాడు. అలా తాజాగా ఓ ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడిన నాని తనకు ఇష్టమైన హీరోయిన్ గురించి రివిల్ చేశాడు.

Nani's HIT 3 likely to face major cuts by Censor board due to too much  violence

ఇందులో భాగంగానే తనకు శ్రీదేవి అంటే ఎంతో ఇష్టమని.. ఆమెను ఎంతగానో ఆరాధించానని చెప్పకొచ్చాడు. క్షణక్షణం సినిమాని ఎన్నిసార్లు చూశానో లెక్కేలేదు. ఒక లక్ష సార్లు చూడదగ్గ సినిమా అది అంటూ వివరించాడు. ఆమె అంత అందంగా ఎలా ఉన్నారో నాకు ఇప్పటికీ అర్థం కాదని.. ఆ సినిమాకే శ్రీదేవి అందాన్ని తీసుకువచ్చారని చెప్పుకొచ్చాడు. ఇదే ఇంటర్వ్యూలో అజయ్ దేవగన్ రైడ్ 2, మీ హిట్ 3 ఒకేరోజు రిలీజ్ అవుతున్నాయి కదా.. ఈ మూవీల‌కు గ‌ట్టిపోటీ తప్పదా.. అనే ప్రశ్నకు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Nani calls late Sridevi his dream date: 'Watching her in Kshana Kshanam  feels unreal to me' - Hindustan Times

రైడ్ 2 కి ప్రాధాన్యం ఇవ్వండి. అజ‌య్ సర్‌తో నాకు పోటీ లేదు. మీకు వీలుంటే.. హీట్ 3ని థియేటర్లలో చూడండి అంటూ చెప్పుకొచ్చాడు. ఇక హిట్ ఫ్రాంచైజ్‌లో భాగంగా తెరకెక్కనున్న సరికొత్త సినిమా.. హిట్ ది థర్డ్ కేస్. నాని హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించగా.. నాని సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా మెరవ‌నుంది.ఇక ఇప్ప‌టికే ఆడియ‌న్స్‌లో మంచి హైప్ తెచ్చుకున్న ఈ మూవీ రిలీజ్ అయ్యిన త‌ర్వాత ఎలాంటి సంచ‌ల‌నం సృష్టిస్తుందో చూడాలి.