ప్రభాస్ – త్రివిక్రమ్ కాంబో మూవీ కోసం ప్రొడ్యూసర్ మాస్టర్ స్కెచ్.. స్టోరీ తెలిస్తే మైండ్ బ్లాకే..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఇండియన్ సినిమాకి ఐకానిక్ గా నిలిచిన సంగతి తెలిసిందే. వరుస పాన్ ఇండియా సినిమాలను నటిస్తూ టాలీవుడ్ సినిమాలు.. ఇండియన్ సినిమాలుగా ప్రజెంట్ చేస్తున్న ప్రభాస్.. చివరిగా సలార్, కల్కి లాంటి రెండు బ్లాక్ బస్టర్ హిట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నాడు ప్రభాస్. ఇక వాటి వాల్యూ దాదాపు పదివేల కోట్లని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఇండియన్ స్టార్‌గా దూసుకుపోతున్న ఆయన చేతిలో.. సరికొత్త ప్రాజెక్టు వచ్చి పడిందని టాక్ నడుస్తుంది. ప్రభాస్‌తో సినిమా తెర‌కెక్కించేందుకు మరో స్టార్ డైరెక్టర్ కథను సిద్ధం చేశాడట. అతను ఎవరో కాదు.. త్రివిక్ర‌మ్‌.

Prabhas upcoming films: From Kalki 2898 AD to Hanu Raghavapudi directorial

వీరిద్దరి కాంబోలో కథను సెట్ చేసేందుకు ఓ స్టార్ ప్రొడ్యూసర్ మాస్టర్ ప్లాన్ వేసాడట. దానికి సంబంధించిన చర్చలు ప్రాథమిక దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ మారుతీతో.. ది రాజాసాబ్‌ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఫౌజి, దాని తర్వాత సందీప్ రెడ్డి వంగా స్పిరిట్, ప్రశాంత్ నీల్‌.. కల్కి 2 సినిమాలను పూర్తి చేయాల్సి ఉంది. అంతే కాదు.. ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో బ్రహ్మరాక్షస సినిమాను చేయనున్నాడంటూ వార్తలు వినిపించాయి. ఇలాంటి క్రమంలో త్రివిక్రమ్ పేరు తెరపైకి రావడం అందరికీ ఆసక్తి కలిగిస్తుంది. ప్రభాస్ హీరోగా ఓ మైథాలజికల్ మూవీని ప్లాన్ చేస్తున్నాడట త్రివిక్రమ్. దానికి జటాయు అనే టైటిల్ పెట్టనున్నాడని.. ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు ఈ కాంబినేషన్ సెట్ చేసేందుకు గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు సమాచారం.

Dil Raju apologises for his comments on Telangana style dawaat

ఈ సినిమా కోసం కథను ఇంద్రగంటి మోహన్ కృష్ణ అందిస్తున్నారని.. ప్రస్తుతం స్టోరీ ప్రైమరీగా డిస్కషన్ స్టేజ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమా రామాయణం ఆధారంగా రూపొందించనున్నారని టాక్. గతంలో రామాయణం ఆధారంగా ఆదిపురుష్‌ సినిమాలో ప్రభాస్ నటించాడు. ప్రభాస్ మళ్ళీ అదే తరహా సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా.. లేదా అనే సందేహం ఇప్పుడు అందరిలోనూ మొదలైంది. అంతేకాదు ఇదే సమయంలో.. ప్రస్తుతం కల్కి 2 సినిమా మహాభారతం ఆధారంగా తెర‌కెక్క‌నుంది. ఇందులో కల్పిగా ప్రభాస్ కనిపించనున్నట్లు టాక్. ఎప్పటికే కల్కి పార్ట్ వన్ లో కర్ణుడిగా ప్రభాస్ ని చూపించారు టీం. అయితే ఇప్పటివరకు త్రివిక్రమ్ – ప్రభాస్ కాంబోలో ఒక్క సినిమా కూడా రాలేదు. ఇలాంటి క్రమంలో వీరు ఇద్దరు కాంబో సెట్ అయితే మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.