టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి.. ఎన్నో కష్టాలు, అవమానాలను ఎదుర్కొన్న చిరంజీవి అంచలంచెలుగా సక్సస్ సాధిస్తూ మెగాస్టార్ రేంజ్‌కు ఎదిగాడు. ఇప్పటికి ఇండస్ట్రీలో అడుగు పెట్టాలనుకునే ఎంతోమందికి ఆయన ఆదర్శంగా నిలిచారు. అంతేకాదు టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్దగా.. ఆయనను ఎంతోమంది గౌరవిస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే.. తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుంటూ చిరంజీవి.. తమ్ముడు నాగబాబు, తల్లి అంజనాదేవితో పాటు.. చెల్లెళ్లతో కలిసి ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేశారు. ఇంటర్వ్యూలో భాగంగానే చిరంజీవి తన తల్లి గురించి.. అలాగే చెల్లెళ్ల గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు.
అంతే కాదు.. కూతురు శ్రీజ విడాకుల విషయంపై కూడా ఆయన రియాక్ట్ అయ్యాడు. చిరంజీవి మాట్లాడుతూ.. తల్లి అంజనా దేవి గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. మా అందరికీ అమ్మ ధైర్యం అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అందరం ఈ స్టేజిలో ఉన్నామంటే దానికి కారణం అమ్మే అంటూ వివరించాడు. ఇక అమ్మకు మొదటి నుంచి నాగబాబు అంటేనే ఇష్టమని.. ఇప్పటికి కూడా వాడిని దగ్గరికి తీసుకుని నుదుటిపై ముద్దులు పెట్టేస్తోంది అంటూ వివరించాడు. ఇక అమ్మ అంటే మా శ్రీజకు కూడా చాలా ఇష్టమని.. శ్రీజ తన లైఫ్ కు సంబంధించిన ఏ నిర్ణయం తీసుకోవాలన్న మొదట నానమ్మ సలహానే తీసుకుంటుంది అంటూ చెప్పుకొచ్చాడు.
ముఖ్యంగా డివోర్స్ టైం లో శ్రీజ అమ్మ సలహా తీసుకుందని. ఆ సమయంలో తను పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లి పోయిందంటూ చెప్పుకొచ్చాడు. రెండుసార్లు విడాకులు తీసుకున్న సమయంలోను శ్రీజ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చిరు వివరించాడు. ఇక విడాకుల సమయంలో శ్రీజ అమ్మకు విషయం చెప్పడంతో.. ఎవరో ఒకరి గురించి నీ లైఫ్ ఇక్కడితో ఆగిపోకూడదు.. నువ్వు ముందుకు వెళ్ళు అంటూ తనలో ధైర్యాన్ని నింపేందని.. ఇలా మా విషయాల్లో కూడా చిన్నప్పటి నుంచి ఆమె మాకు ధైర్యాన్ని కల్పించిందని.. ప్రోత్సహించిందని చిరు వివరించాడు. ఇక ఇప్పటికే తన లైఫ్ లో రెండు సార్లు విడాకులు తీసుకున్న శ్రీజ.. ప్రస్తుతం తన ఇద్దరు పిల్లల బాధ్యతలను చూసుకుంటూ సోలో లైఫ్ లీడ్ చేస్తుంది.