పవన్ కళ్యాణ్ మాజీ భార్య.. ఒకప్పటి స్టార్ హీరోయిన్ రేణు దేశాయ్ పేరు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో తెగ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. పవన్‌లో విడిపోయిన తర్వాత.. ఇద్దరు పిల్లలను పూణేకు తీసుకెళ్లి అక్కడే సెటిల్ అయినా రేణు దేశాయ్.. ఇండస్ట్రీకి దూరమైనా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటూ.. తనకు సంబంధించిన అన్ని పర్సనల్ విషయాలను అభిమానులతో పంచుకుంది. ఇదే టైంలో.. ఆమెను ట్రోల్ చేసే వారికి సైతం తనదైన స్టైల్‌లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. పవన్‌తో విడాకులపై ఆయన ఫ్యాన్స్ ఎన్నోసార్లు ఇబ్బందికర కామెంట్లు చేసిన.. పవన్‌కి విడాకులు ఇచ్చి తప్పు చేశారంటూ అభిప్రాయాలను వ్యక్తం చేసిన వారిపై రియాక్ట్ అవుతూ.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రేణు దేశాయ్.. పవన్‌ను నేను వదిలేయలేదు.. ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు.. మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడని చెప్పి వాళ్ళ నోరుమూయించింది.
అంతేకాదు సమాజంలో జరిగే తప్పులపై కూడా తాను ఎప్పటికప్పుడు తనదైన స్టైల్‌లో రియాక్ట్ అవుతూనే ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రేణు.. పవన్ కళ్యాణ్ రియల్ క్యారెక్టర్ గురించి షాకింగ్ కామెంట్లు చేసింది. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం చాలా మంచిదని చెప్పుకొచ్చిన ఆమె.. గతంలో వాళ్ళిద్దరూ కలిసి నటించిన జానీ సినిమా విషయాలను షేర్ చేసుకుంది. సినిమాలో పవన్ కళ్యాణ్ ఎంతగానో కష్టపడ్డారని అయితే సినిమా ఫ్లాప్ కావడంతో సినిమా నిర్మాతలకు తన రెమ్యూనరేషన్‌ను తిరిగి ఇచ్చేసాడని చెప్పుకొచ్చింది. అలాగే.. పవన్ నటించిన సినిమాలు ఫెయిల్ అయితే రెమ్యూనరేషన్ ఇచ్చేస్తూ ఉంటాడని వివరించింది.
ఇక సినీ ఆర్టిస్టులకు కూడా ఎన్నో సందర్భాల్లో ఆయన సాయం చేశారని చెప్పుకొచ్చింది. కాగా పవన్‌తో విడాకుల తర్వాత కూడా.. రేణు దేశాయ్ ఆయనపై ఇంతలా పాజిటివ్ కామెంట్ చేయడంతో అంతా షాక్ అవుతున్నారు. అభిమానుల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక రేణు దేశాయ్ విషయానికి వస్తే.. ఇండస్ట్రీకి దూరమైనా ఈ అమ్మడు ఇటీవల రీ ఎంట్రీ ఇచ్చి రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కీలకపాత్రలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది. తర్వాత తన నెక్స్ట్ సినిమాను ఇప్పటివరకు అనౌన్స్ చేయని రేణు దేశాయ్.. తాజాగా సినిమాల విషయంలో తన లేటెస్ట్ అప్డేట్ ను అందించింది. సరిగ్గా ఏడాది తర్వాత తాను తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తానంటే చెప్పుకొచ్చింది. మొత్తానికి ఏడాది తర్వాత మళ్లీ రేణు దేశాయ్‌ని స్క్రీన్ పై చూడవచ్చని అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.