తెలుగు సినీ ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుని ఎంతో మంది స్టార్ హీరోస్గా రాణిస్తున్నారు. ఈ క్రమంలోని మొత్తం ఇండియన్ సినీ ఇండస్ట్రీ టాలీవుడ్ సినిమాలు వైపు చూస్తుందనడంలో అతిశయోక్తి లేదు. టాలీవుడ్ దర్శకరుడు రాజమౌళి.. బాహుబలి లాంటి సినిమాతో పాన్ ఇండియాకు తెలుగు సినిమాలు ఇంట్రడ్యూస్ చేశాడు. జక్కన్న మార్క్ సక్సెస్ తర్వాత.. ఆయన బాటలోనే ఎంతమంది స్టార్ట్ డైరెక్టర్ టాలీవుడ్ సినిమాలను పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించి హిట్లు అందుకున్నారు. ఇక తెలుగు హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ లాంటి విలక్షణ నటుడు ఆడియన్స్‌ను ఎంతలా ఆకట్టుకుంటున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఈ క్రమంలోనే మంచి సినిమాలను ఎంచుకుంటూ సక్సెస్‌లను అందుకుంటున్న తారక్.. పాన్ ఇండియన్ రేంజ్‌లో భారీ సక్సస్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. ఇప్పటికే వరుసగా 7 సినిమాలతో హిట్ అందుకున్న తారక్.. పాన్ ఇండియా ఇండస్ట్రీని షేక్ చేసే సినిమాలను అందించలేక పోయాడు. ఇక గతేడాది వచ్చిన దేవరతో రూ.500 కోట్ల కలెక్షన్లు మాత్రమే రాబట్టడం ఫ్యాన్స్‌ను కాస్త నిరాశపరిచింది. ప్రస్తుతం ఎన్టీఆర్ కంటే అల్లు అర్జున్ కు పాన్ ఇండియా లెవెల్లో భారీ క్రేజ్ నెలకొన్న సంగతి తెలిసిందే. పుష్ప 2తో ఏకంగా రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనం సృష్టించాడు బన్నీ.
ప్రస్తుతం ఈ సక్సెస్ జోరు ఎంజాయ్ చేస్తున్న బన్నీకి ఒకప్పుడు తారక్ తక్కువ మార్కెట్ ఉండేది. అలాంటిది ఆయన నటించిన అలవైకుంఠపురం సినిమాతో నాన్ బాహుబలి ఇండస్ట్రియల్ హిట్ సొంతం చేసుకొని.. తర్వాత పుష్ప సిరిస్ సినిమాతో భారీ రికార్డులు క్రియేట్ చేశాడు. ఈ సినిమాలతోనే ఆయన మార్కెట్ మరింతగా పెరిగింది. ఈ క్రమంలోనే తారక్ కంటే తక్కువ మార్కెట్ ఉన్న.. బన్నీ ఎన్టీఆర్ ను డామినేట్ చేస్తూ ముందంజలో దూసుకుపోతున్నాడు. ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ఆయినా భారీ సక్సెస్ సాధించి.. ఇండస్ట్రీలో ఇప్పటివరకు క్రియేట్ అయిన రికార్డులను బ్లాస్ట్ చేసి నెంబర్ వన్ గా నిలుస్తుందో.. లేదో.. వేచి చూడాలి. ఒకవేళ ఈ సినిమా అదే రేంజ్ లో సక్సెస్ అందుకుంటే మాత్రం ఇక తారక్ స్పీడ్ కు బ్రేక్లు ఉండవనడంలో అతిశయోక్తి లేదు.