టాలీవుడ్ నందమూరి నటసింహం.. బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె ఎలాంటి క్రేజ్ దక్కించుకుందో తెలిసిందే. ఇక ఈ షోలో ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలను ఇంటర్వ్యూ చేసిన బాలయ్య ఒక హీరో ఇంటర్వ్యూ విషయంలో మాత్రం చాలా విసిగిపోయాడట ఇంతకి అతనేవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. బాలయ్య.. పవన్‌ను ఇంటర్వ్యూ చేసిన ఎపిసోడ్ గురించి ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఈషోలో.. బాలయ్య, పవన్ మధ్య జరిగిన సంభాషణలు అభిమానులను ఆకట్టుకున్నాయి. అయితే.. తర్వాత బాలయ్య ఎపిసోడ్‌కు సంబంధించి చేసిన కొన్ని ఇన్ డైరెక్ట్ కామెంట్స్ ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి.
అన్‌స్టాపబుల్‌లో పవన్ పాల్గొన్న ఎపిసోడ్‌కు మంచి క్రేజ్ దక్కింది. ఈ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయిన సమయంలోనే సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయింది. ఫిబ్రవరి 2023న ఫుల్ స్ట్రీమింగ్ అయిన ఈ ఎపిసోడ్.. రిలీజ్ అయిన కొన్ని గంటలకే రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఈ ఎపిసోడ్ తర్వాత వచ్చిన ఎపిసోడ్‌లో సుహాసిని, శ్రియ, హరీష్ శంకర్.. బాలకృష్ణతో కలిసి సందడి చేశారు. ఇందులో సుహాసిని బాలయ్యను ప్రశ్నిస్తూ.. మీ షోలో మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా.. విసిగించిన వారు ఎవరైనా ఉన్నారా అని అడగగా.. చాలా కూల్ గా రియాక్ట్ అయిన బాలయ్య.. ఒక హీరో నా షోలో అసలు మాట్లాడలేదు. కేవలం నవ్వుతూ కూర్చున్నాడు. చాలాసేపు నేనే మాట్లాడాల్సి వచ్చింది.. ఇక అరగంట తర్వాత ఆ హీరో ఓపెన్ అప్పయ్యాడు.
ఇక మనతో మామూలుగా ఉండదు కదా అంటూ ఆసక్తికరంగా కామెంట్స్ చేశాడు. అయితే తర్వాత.. ఇంతకీ బాలయ్య మాట్లాడిన హీరో ఎవరనే సందేహాలు అందరిలో మొదలయ్యాయి. ఎట్టకేలకు ఎపిసోడ్ చివరకు హరీష్ శంకర్ ఇంతకీ ఆ హీరో ఎవరని ప్రశ్నించగా.. మీ వాడే అంటూ బాలయ్య చెప్పుకొచ్చాడు. దీంతో బాలయ్య చేసిన కామెంట్స్ పవన్ గురించి అని క్లారిటీ వచ్చింది. ఈ ఎపిసోడ్ రిలీజ్ అయిన తర్వాత పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో దీనిని మరింత హైలెట్ చేస్తూ.. తెగ పోస్టులు పెట్టారు. కొన్ని గంటల్లోనే ఈ ఎపిసోడ్ 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను దాటి సంచలనం సృష్టించింది. పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎప్పటికీ తగ్గదని ఈ ఎపిసోడ్ మరోసారి ప్రూవ్ చేసింది.