చిరు, పవన్‌కు నాగబాబు ఎంత అప్పున్నాడో తెలుసా.. అప్పులు, ఆస్తుల లెక్కలు ఇవే..!

మెగా బ్రదర్ కొణిదల నాగేంద్రరావు (నాగబాబు) తాజాగా ఎన్డిఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నికల సంఘానికి నాగబాబు ఆస్తుల అప్పుల వివరాలు అఫిడవిట్ సమర్పించాడు. ఇందులో ఆయన మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ లకు అప్పు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆయన స్థిరాస్తులు, భూములు అన్ని కలిపి మొత్తంగా ఎన్ని ఆస్తులు ఉన్నాయో ఈ అప్డేట్లో వివరించారు. ప్రస్తుతం నాగబాబు ఈ అఫిడవిట్లో పేర్కొన్న ఆస్తుల వివరాలు మెగా అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇంతకీ నాగబాబు ఆస్తుల వివరాలు ఏంటో.. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల ద‌గ్గ‌ర‌ ఆయన తీసుకున్న‌ అప్పు లెక్కలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం.

చిరంజీవి, పవన్ కల్యాణ్ నుంచి అప్పు తీసుకున్న నాగబాబు - ఎంతంటే?

నాగబాబు అఫిడ‌విట్‌లో తన బాండ్. మ్యూచువల్ ఫండ్స్ నగదు కలిపి రూ.59 కోట్ల ఆస్తులు ఉన్నట్లు వివరించాడు. ఇక చేతిలో నగదు రూ.21.81 లక్షలు ఉండగా.. బ్యాంకు ఖాతాల్లో రూ.23.53 లక్షలు ఉన్నాయని.. ఇతరులకు ఇచ్చిన అప్పులు రూ.1.03 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నాడు. ఇక రూ.67.28 లక్షల విలువ చేసే బెంజ్ కార్‌తో పాటు.. రూ.11.4 లక్షల విలువ చేస్తే హుందాయి కార్ కూడా ఆయన వద్ద ఉంది. బంగారం, వెండి అంత కలిపి రూ.57.99 లక్షలు విలువైన వస్తువులు ఉన్నాయి. ఇందులో 724 గ్రాముల బంగారు ఉండగా.. భార్య వద్ద 55 క్యారెక్టర్ల వజ్రాలు రూ.16.5 లక్షలు విలువ చేసేవి. 20 కేజీల వెండి రూ.21.40 లక్షలవి ఉన్నాయట. హైదరాబాద్ పరిసరాల్లో రూ.11 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు ఆయన పేర్కొన్నాడు. ఇందులో హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాలో ఆయనకు భూములు ఉన్నట్లు వివరించాడు.

Pawan Kalyan and Nagababu visits his elder brother Chiranjeevi on the sets  of Vishwambhara | Vishwambhara: వీడియో - 'విశ్వంభర' సెట్స్‌లో పవర్ స్టార్ -  మెగా బ్రదర్స్‌ను చూసేందుకు రెండు ...

రంగారెడ్డి జిల్లాలో 2.39 ఎకరాల భూమి..రూ. 5.3 కోట్ల విలువ చేస్తుందని, మెదక్ జిల్లా నరసాపురంలో రూ.82.80 లక్షల విలువచేసే.. 8.28 ఎకరాల భూమి, రంగారెడ్డి జిల్లా టేకులపల్లిలో రూ.53.50 లక్షల విలువ చేసే 1.07 ఎకరాల భూమి ఉన్నట్లు వివరించాడు. అంతేకాదు.. హైదరాబాద్ మణికొండలో రూ.2.8 కోట్ల విలువ చేసే విల్లా ఆయనకు ఉండ‌గా.. మొత్తం స్థిరాస్థల విలువ రూ.11.20 కోట్లని పేర్కొన్నాడు. అంతే కాదు.. అన్న చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్ లకు కూడా ఆయన అప్పు ఉన్నట్లు అందులో వివరించాడు. చిరంజీవి దగ్గర రూ.28.48 లక్షల అప్పు తీసుకున్నానని.. పవన్ కళ్యాణ్ దగ్గర రూ.16.90 లక్షల అప్పు తీసుకున్నానని ఆయన పేర్కొన్నాడు. ఇంతే కాకుండా బ్యాంక్ హౌసింగ్ లోన్ కింద రూ.56.97 లక్షలు, కార్ లోన్ రూ.7.54 లక్షలు ఉన్నట్లు అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం నాగబాబు అఫీడవిట్ నెట్ ఇంట వైరల్ గా మారుతుంది.