టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఇండస్ట్రీలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోలు. వీళ్లలో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడంతో.. సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నాడు. మహేష్ బాబు కేవలం సినిమాలోనే కాకుండా.. యాడ్స్ లోను నటిస్తూ సంపాదిస్తున్నాడు. అయితే.. వీళ్ళిద్దరి కంటే ఎక్కువగా సంపాదించిన హీరో అనగానే నాగార్జున పేరు వినిపిస్తుంది. నాగార్జున సినిమాల్లో కంటే కూడా బిజినెస్ పరంగా కోట్లు కూడబెడుతున్నాడు. ఇలాంటి క్రమంలో.. ఇప్పుడు నాగార్జున కంటే పవన్, మహేష్ కంటే కూడా.. రిచెస్ట్ హీరో ఇతనేనంటూ ఓ కుర్ర హీరో పేరు వైరల్‌గా మారుతుంది. ఆ హీరో ఎవరో కాదు.. సచిన్ జోషి.
టాలీవుడ్ లో సచిన్ జోషి నటించినవి చాలా తక్కువ సినిమాలు అయినా.. మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. మౌనమేలనోయి, ఒరేయ్ పండు, నిన్ను చూడక నేనుండలేను ఇలాంటి ఎన్నో సినిమాల్లో నటించి రాణించాడు. సచిన్ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎలాంటి సినిమాల్లో నటించడం లేదు. అయితే.. సచిన్ జోషి గతంలో నీ జతగా నేనుండాలి సినిమాలోను హీరోగా నటించాడు. ఆషికి 2 తెలుగు రీమిక్స్ సినిమాలో నటించగా.. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. బండ్ల గణేష్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ఈ సినిమా కారణంగా వీరిద్దరి మధ్యన చాలా వివాదాలు కూడా జరిగాయని అంటారు. ఇక సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందే.. సచిన్ జోషి ఫుల్ రిచ్. గతంలో కింగ్ ఫిషర్ వీల్లను కొనుగోలు చేసింది కూడా సచిన్ జోషినే.
ఏకంగా రూ.73 కోట్లు వెచ్చించి మరీ ఆ విల్లా తన సొంతం చేసుకున్నాడు. ఏ కార్ నచ్చితే ఆ కారు వెంటనే కొనడం సచిన్ జోషికి అలవాటు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో తెలుగు టీం తరఫున ఆడి మంచి పాపులారిటి దక్కించుకున్న సచిన్ జోషికి మూవీస్ కేవలం ఓ హాబీ మాత్రమే. సినిమా సక్సెస్, ప్లాపులతో అసలు అవసరమే లేదు. ఇక సచిన్ జోషి చేయని బిజినెస్ లేదు. పొద్దున్నే ఒక దేశంలో ఉంటే.. మధ్యాహ్నం మరో దేశం లో మెరుస్తారు. ఇలా బిజినెస్ పరంగా రాణిస్తున్న సచిన్ జోషి.. టాలీవుడ్ లోనే రిచెస్ట్ హీరోగా మారిపోయారు. అయితే డబ్బుల గురించి అసలు ఆలోచించకుండా తనకు నచ్చినట్లుగా ఖర్చు పెడుతూ ఉంటాడట సచిన్ జోషి. అంతేకాదు.. సచిన్ జోషి భార్య కూడా ఒక నటి అన్న సంగతి చాలా మందికి తెలియదు. ఆమె పేరు ఊర్వశి శర్మ.