ఏపి డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పొలిటిషన్ గా బిజీ గా గడుపుతున్న సంగతి తెలిసిందే. తీరిక దొరికినప్పుడల్లా సైన్ చేసిన సినిమాల షూటింగ్‌లోను సందడి చేస్తున్నాడు పవన్. ఇక ఆయన చేతిలో ఉన్న మూడు సినిమాల్లో పవన్ అభిమానులతో పాటు సాధారణ ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ ఓజి. సుజిత్ డైరెక్షన్ లో ఏడాది క్రితం ప్రారంభమైన ఈ సినిమా షూట్ 70% ముగిసింది. కేవలం పవన్ కళ్యాణ్ కు సంబంధించిన 21 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. ఇక ఈ షూట్ కూడా ముగించి త్వరలోనే ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడట పవన్. డిప్యూటీ సీఎం రోల్ లో ఫుల్ బిజీగా గడుపుతున్న ఆయన.. ఇప్పుడిప్పుడే కాస్త ఫ్రీ అవుతున్నట్లు సమాచారం.
హరిహర వీరమల్లు, ఓజి రెండు సినిమాలను పూర్తి చేసేసి వెంటనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. వీరమల్లుకు ఇంకా నాలుగు రోజుల్లో డేట్స్ ఇస్తే చాలు.. ఆ సినిమా పూర్తయిపోతుంది. దాంతో ఈ షూట్ ముగిసిన వెంటనే ఓజి సినిమాకు కూడా కావాల్సిన కాల్ షీట్లు ఇవ్వడానికి పవన్ ప్లాన్ చేస్తున్నాడు. ఈనెలాఖరు, లేదా వచ్చే నెల నుంచి ఓజి సినిమా సెట్ లో పవన్ సందడి చేయనున్నాడట. ఇప్పటికే రిలీజ్ డేట్ లో కూడా ఫిక్స్ చేశారని.. వచ్చే నెలలో పవన్ డేట్స్ లాక్ అయిన వెంటనే గ్రాండ్ గా రిలీజ్ డేట్ ప్రకటించనున్నారని అంటున్నారు. సెప్టెంబర్ 25 డిసెంబర్ నెలలో సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇప్పటికే ఈ సినిమా పై భారీ బజ్ నెలకొంది. కనుక సీజన్ తో సంబంధం లేకుండా సినిమా ఎప్పుడు రిలీజ్ అయిన సంచలనం సృష్టించడం ఖాయం అంటూ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా సినిమా థియేట్రికల్ రైట్స్ కూడా అమ్ముడుపోయాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ రూ.230 కోట్ల ప్రీ థియేటర్ల్ బిజినెస్ జరుపుకున్న ఓజి.. డిజిటల్ హక్కులు కూడా ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ 120 కోట్లకు కొనుగోలు చేసిందని సమాచారం. ఇక ఆడియో, సాటిలైట్ రైట్స్, హిందీ డబ్బింగ్ రైట్స్ అన్ని కలుపుకొని రూ.450 కోట్లకు పైగా సినిమా బిజినెస్ జరిగిందట. పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే ఆల్ టైం హైయెస్ట్ బిజినెస్ ఇదే అంటూ టాక్ నడుస్తుంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే రూ.160 కోట్ల మేర బిజినెస్ జరిగిందట. కెవలం గ్లింప్స్‌తోనే ఆడియన్స్ లో భారీ బజ్ నెలకొల్పిన ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.