ప్రస్తుతం టాలీవుడ్‌లో తెగ మారుమోగిపోతున్న పేరు ఐశ్వర్య రాజేష్. తాజాగా సంక్రాంతికి రిలీజై భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాల్లో.. ఈ అమ్మడు భాగ్యం రోల్‌లో నటించి.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా భారీ సక్సెస్ అవడంతో ఐశ్వర్యకు వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఈ సినిమాలో అమ్మడి నటనకు ఫిదా అయినా లక్షలాది మంది అభిమానులు ఈమెకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి ఆరటపడుతున్నారు. ఈ క్రమంలోనే ఐశ్వర్య కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారుతుంది.
ఐశ్వర్య హీరోయిన్ గా మారక ముందే.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలో నటించిందన సంగతి చాలామందికి తెలియదు. ఇంతకీ ఆ మూవీ ఏంటో.. అసలు మేటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. పేరుకు తెలుగు అమ్మాయి అయినా.. తమిళ్ లో వరుస సినిమాలో నటించి మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఐశ్వర్య.. కోలీవుడ్ స్టార్ హీరోల అందరితో నటించి సూపర్ హిట్లు తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం తెలుగులోనూ మంచి అవకాశాలు దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమా మాత్రం.. టాలీవుడ్ మూవీనే అట.
తను చిన్నతనంలోనే ఓ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిందట. అది కూడా తెలుగు మూవీ కావడం విశేషం. ఇంతకీ ఆ సినిమా ఏదో కాదు నటకిరిటి రాజేంద్రప్రసాద్ హీరోగా తెరకెక్కిన రాంబంటు. ఈ సినిమాలో ఐశ్వర్య చైల్డ్ ఆర్టిస్ట్ గా మెరిసింది. ఇక ఈ సినిమా తర్వాత.. చాలా కాలం గ్యాప్‌తో కౌశల్య కృష్ణమూర్తి సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్గా పరిచయమైంది. వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీష్ లాంటి సినిమాల్లోనూ ఆకట్టుకుంది. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ క్రేజ్ మూటకట్టుకుంది.