సినీ ఇండస్ట్రీలో.. అది కూడా టాలీవుడ్‌లో ఇప్పటి వరకు తండ్రి, బాబాయ్, కొడుకులతో రొమాన్స్ చేసిన హీరోయిన్‌లు ఎంతోమంది ఉన్నారు. ఈ క్రమంలోనే తండ్రి, కొడుకుల సినిమాలు రెండింటికి న్యాయం చేసి వారికి సక్సెస్ కూడా ఇచ్చారు. అలాంటి వారిలో కాజల్, తమన్నా, నయనతార, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి హీరోయిన్ల పేర్లు వినిపిస్తాయి. ఈ ముద్దుగుమ్మలు నలుగురు.. తండ్రి, కొడుకుల ఇద్దరి సినిమాలకు హీరోయిన్గా నటించి హిట్లు అందుకున్నారు. అలాంటి క్రేజీ కాంబినేషన్లో చిరంజీవి, రాంచరణ్ లతో.. కాజల్, తమన్నా నటించి మెప్పించారు. ఇక ఎన్టీఆర్ – బాలకృష్ణ లతో కాజల్, నాగార్జున – నాగచైతన్యలతో రకుల్ ప్రీత్ సింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంటుంది.
ఇంతమందితో సినిమాలు తెరకెక్కిన ఇందులో దాదాపు ఇద్దరు తండ్రి – కొడుకుల సినిమాలకు బ్లాక్ బస్టర్లు ఇచ్చారు ఈ ముద్దుగుమ్మలు. అయితే.. బాబాయ్ అబ్బాయిలు బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ లో ఇద్దరితో కలిసి నటించిన ఓ హీరోయిన్ మాత్రం తారక్‌కు ఫ్లాప్ ఇచ్చి బాలయ్యకు బ్లాక్ బస్టర్ ఇచ్చిందట. ఇంతకీ ఆమె ఎవరో కాదు లోకనాయకుడు కమలహాసన్ నటవరసరాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతిహాసన్. టాలీవుడ్‌లో యంగ్ సీనియర్ హీరోలు అందరితోనూ నటించిన ఈ అమ్మడు.. ప్రస్తుతం టాలీవుడ్ గోల్డెన్ బ్యూటీగా రాణిస్తుంది. ఇక శృతి బాలకృష్ణతో కలిసి వీర సింహారెడ్డి సినిమాలో నటించి సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. గతేడాది సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన ఈ సినిమా బాలయ్యకు మంచి సక్సెస్ ని ఇచ్చింది.
ఈ సినిమాతో పాటే.. మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది. అయితే.. ఈ సినిమాలోని శృతిహాసన్ హీరోయిన్‌గా నటించిన బాలయ్యకు సూపర్ హిట్ ఇచ్చిన శృతిహాసన్.. కొడుకు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు మాత్రం ఘోరడిజాస్టర్ ఇచ్చింది. గతంలో రామయ్య వస్తావయ్య సినిమాలో శృతిహాసన్ పల్లెటూరి అమ్మాయి పాత్రలో తారక్ జోడిగా మెరిసిన సంగతి తెలిసిందే. దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు. రామయ్య వస్తావయ్య సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంది అని టాక్ వచ్చిన.. సెకండ్ హాఫ్ చిరాకు తెప్పించింది అనే టాక్ నడిచింది. ఈ క్రమంలోనే.. సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అలా బాలయ్య బాబాయ్ కి హిట్ ఇచ్చిన శృతి.. అబ్బాయి ఎన్టీఆర్‌కు మాత్రం ఫ్లాప్‌ని మిగిల్చింది.