మిల్కీ బ్యూటీ తమన్న ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మ.. గత కొన్నేళ్ళగా కెరీర్ పరంగా నెమ్మదించింది. మెయిన్ హీరోయిన్‌గా ఆఫర్లు దక్కకపోవడంతో.. స్పెషల్ సాంగ్స్ లోనూ, మ్యూజిక్ ఆల్బమ్స్ లోను నటిస్తోంది. మరోపక్క వెబ్ సిరీస్ లోను రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఓవైపు సినీమాల పరంగా గందరగోళం నెలకొంది అనుకుంటే.. మరోవైపు పర్సనల్ లైఫ్ లోను తమన్నా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నట్లు టాక్ నడుస్తోంది. ఈమె బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమయణం నడుపుతున్న సంగతి తెలిసిందే.
అయితే.. తాజాగా అతనితో కొన్ని కారణాల వల్ల బ్రేకప్ అయిందని.. ప్రస్తుతం వీరిద్దరూ విడిగానే ఉంటున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా.. ఆమె చేసిన వ్యాఖ్యలు, ఈ బ్రేకప్ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చాయి. దాదాపు రెండు సంవత్సరాలుగా ప్రేమాయణం కొనసాగిస్తున్న ఈ జంట.. విడిపోయారని తెలుస్తుంది. విజయవర్మ సినిమాలతో బిజీగా ఉండడంతో పెళ్లిపై ఇంట్రెస్ట్ లేదని ఇప్పుడు కాదు మరో రెండు మూడు ఏళ్ల తర్వాత వివాహం చేసుకుందామని చెప్పినట్లు తెలుస్తుంది. అయితే తమన్న మాత్రం వెంటనే వివాహం చేసుకొని సెటిల్ అవ్వాలని భావిస్తుందట. ఈ క్రమంలోనే వీరి మధ్య విభేదాలు తలెత్తి బ్రేకప్ అయిందని.. బాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది.
అయితే తాజాగా ఆమిల్కీ బ్యూటీ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఈ వార్తలకు బాలాన్ని చేకూర్చింది. ప్రేమలో ఎమోషన్, ఫీలింగ్స్ ఉండాలి. అంతేగాని.. ఎదుటి వ్యక్తి నాకోసం అలా చేయాలి.. అది చేసి పెట్టాలి.. ఇది చేసి పెట్టిలి అనే ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. అలా ఉన్నపుడు అది ప్రేమ కాదు.. వ్యాపారమే అవుతుంది. ప్రేమ ఎప్పుడు బిజినెస్‌లా మారుతుందో.. అప్పుడు కలిసి ఉండడం కష్టం. దానికంటే విడిపోవడం ఉత్తమం అంటూ.. సోస్ట్ షేర్ చేసుకుంది. ఎదుటివారికి స్వేచ్ఛ ఇచ్చే విధంగా తమ ప్రేమ ఉండాలి తప్ప.. ఒకరిని కటడి చేసేలా ఉండకూడదు అంటూ తమన్న చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తమన్న చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి.